Bhumika Chawla: ‘ఖుషి’ సినిమాలో పాటకి డ్యాన్స్ చేసి హుషారెత్తించిన భూమిక..వీడియో వైరల్..!

పవన్ కళ్యాణ్ కెరీర్ లో 7వ చిత్రంగా వచ్చిన ‘ఖుషి’ అప్పట్లో రికార్డులు సృష్టించింది.ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ చిత్రం ఆ రోజుల్లోనే రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టి… కోలీవుడ్, బాలీవుడ్ ట్రేడ్ కు కూడా షాక్ ఇచ్చింది. ‘ఖుషి’ కూడా ఓ ప్రేమ కథా చిత్రం. అయినప్పటికీ ఈ మూవీలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. అప్పటి ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని కలిగించింది ‘ఖుషి’ చిత్రం.

Click Here To Watch

ఇప్పటి జనరేషన్ ను ముఖ్యంగా ఇప్పటి యూత్ ను ఆకర్షించే ఎన్నో అంశాలు ‘ఖుషి’ లో ఉంటాయి. భూమిక- పవన్ కళ్యాణ్ ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. ఒక్క నడుము సీన్ తో సినిమా మలుపు తిరగడం అప్పటి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఈ చిత్రాన్ని చాలా ఏరియాల్లో సెకండ్ రిలీజ్ ఇచ్చినప్పటికీ.. ఆ ఏరియాల్లో కూడా భారీగా వసూళ్ళను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ మూవీతో భూమిక స్టార్ డంని సంపాదించుకుంది.

తర్వాత మహేష్ తో చేసిన ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో చేసిన ‘సింహాద్రి’ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లు కావడంతో ఈమెకు ఆఫర్లు ఓ రేంజ్లో వచ్చాయి. కొన్నాళ్ళకి ఆమె పెళ్లి చేసుకుని సినిమాలని తగ్గించింది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది ఈ నటి. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రావడం లేదు. దీంతో అన్ని వైపుల నుండీ బలంగా ప్రయత్నిస్తుంది. మొన్నామధ్య తన గ్లామర్ ఫొటోలతో సందడి చేసిన భూమిక తాజాగా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది.

‘ఖుషి’ సినిమాలోని ‘అమ్మాయే సన్నగా’ పాటకి డ్యాన్స్ చేసింది. ‘ఖుషి’ సినిమా రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు కావస్తున్నా భూమికలో అదే గ్రేస్ కనిపించడం విశేషం. ఫిజిక్ కూడా ఎప్పటిలానే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు భూమిక వయసు 43 ఏళ్ళు కావడం గమనార్హం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!


ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus