Bhumika: టాలీవుడ్ స్టార్స్ గురించి భూమిక అలా అన్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు, భూమిక కాంబినేషన్ లో తెరకెక్కిన ఒక్కడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఎం.ఎస్.రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ బాబుకు మాస్ హీరోగా గుర్తింపు రావడానికి ఈ సినిమానే కారణమని చాలామంది భావిస్తారు.

అయితే గతంలో ఒక సందర్భంలో భూమిక మహేష్ బాబు గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర్యాపిడ్ ఫైర్ లో భాగంగా చిరంజీవి గ్రేట్ డ్యాన్సర్ అని జూనియర్ ఎన్టీఆర్ ఫంటాస్టిక్ డ్యాన్సర్ అని పవన్ కళ్యాణ్ వెరీ ఇంటెలిజెంట్ అని మహేష్ బాబు వెరీ క్యూట్ అని భూమిక తెలిపారు. వెంకటేష్ స్పిరిచ్యువల్ అని భూమిక కామెంట్లు చేయడం గమనార్హం. భరత్ ఠాకూర్ గురించి చెబుతూ నాకు తెలియకుండానే భరత్ ఎంగేజ్మెంట్ కు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచాడని చెప్పుకొచ్చారు.

నాకు ఏదో పని పురమాయించి నేను వచ్చేలోపు అన్ని ఏర్పాట్లు చేశాడని ఎంగేజ్మెంట్ కు మా ఇద్దరి కుటుంబ సభ్యులు వచ్చారని ఆమె కామెంట్లు చేశారు. కుటుంబ సభ్యులను చూసి నాకు ఆశ్చర్యం వేసిందని భరత్ ఠాకూర్ అందరి మధ్యలో మోకరిల్లి నన్ను పెళ్లి చేసుకుంటావా అని రొమాంటిక్ గా అడిగాడని భూమిక కామెంట్లు చేశారు. భరత్ మూడ్ బాలేకపోతే నేను డ్యాన్స్ చేస్తానని మంచి మ్యూజిక్ పెడతానని ఇంటిని పూలతో అలంకరిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

భూమిక నటించిన సినిమాలలో అనసూయ ఇష్టమని భూమిక ఇల్లాలిగా కంటే సినిమా నటిగా ఇష్టమని భరత్ ఠాకూర్ అన్నారు. ఒకే డ్రెస్ లో ఆ సినిమాలో మెజారిటీ సీన్లలో ఆమె నటించిందని భూమిక కళ్లు అంటే ఇష్టమని భరత్ ఠాకూర్ కామెంట్లు చేశారు. భూమిక ప్రస్తుతం అక్క, వదిన తరహా పాత్రలలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. భూమిక తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus