Bhumika: ప్రభాస్ సినిమాలో భూమిక ఏ క్యారెక్టర్‌లో కనిపించనుందంటే.?

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా అండ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో సందడి చేస్తున్నారు.. బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఆదిపురుష్’ షూట్ కంప్లీట్ చేసేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఉంది. దానితో పాటు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ – K’ కూడా ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సంగతి ఏమో కానీ ఇటీవల మారుతి దర్శకత్వంలో సైలెంట్‌గా ఓ సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు..

సూపర్ నేచురల్ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారని సమాచారం.. డిసెంబర్ 8 నుండి ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.. ఇందుకోసం భారీ వ్య‌యంతో ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్ సెట్‌ వేశారట.. ప‌దిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్‌ జరుగనుంది.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. ఈ మూవీలో సీనియర్ నటి భూమిక చావ్లా కీలకపాత్రలో కనిపించనుందట..

సుమంత్ ‘యువకుడు’ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి పరిచయమైన భూమిక.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ తో గుర్తింపు తెచ్చుకుని.. ‘ఒక్కడు’, ‘సింహాద్రి’ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ పక్కన ఆడిపాడిన భూమిక పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చింది.. నాని ‘MCA’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. బాలయ్య ‘రూలర్’ లో కీలకపాత్రలో కనిపించింది.. ‘పాగల్’, ‘సీటీమార్’, ‘ఇదే మా కథ’ చిత్రాల్లోనూ కనిపించింది..

తన ఫస్ట్ సినిమా హీరో సుమంత్‌కి జతగా ఇటీవలే ‘సీతా రామం’ మూవీలో కనిపించింది.. ఇక ప్రభాస్ – మారుతి సినిమా విషయానికొస్తే.. కథలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన హీరో సిస్టర్ క్యారెక్టర్ ఆమె చేయనుందని అంటున్నారు. ప్రభాస్‌కి అక్కగా భూమిక కనిపించనుంది.. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus