Bhumika: స్టార్ హీరో మరణం పై స్పందించి ఎమోషనల్ అయిన భూమిక!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమాలో కూడా నటించారు.

ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భూమిక పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ సుశాంత్ మరణం తనని ఎంతగానో కృంగతీసిందని తెలియజేశారు.ఇప్పటికీ సుశాంత్ మరణ వార్తను తాను నమ్మలేకపోతున్నానని తెలిపారు.

సుశాంత్ కరోనా సమయంలో మరణించడం వల్ల తాను (Bhumika) ముంబైకి దూరంగా ఉన్నానని, సుశాంత్ చివరి చూపుకు కూడా తాను నోచుకోలేదని ఈ సందర్భంగా సుశాంత్ మరణాన్ని తలుచుకొని ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇలా సుశాంత్ మరణం గురించి భూమిక మాట్లాడటానికి కారణం లేకపోలేదు. భూమిక సుశాంత్ నటించిన ఎంఎస్ ధోని సినిమాలో భూమిక సుశాంత్ కు అక్క పాత్రలో నటించారు.ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పాలి.

అతను చాలా మంచి వ్యక్తి. తనతో సినిమా తీసేట్టప్పుడు కొన్ని సన్నివేశాలు రాంచీలో తీశాం. అప్పుడు మేం సెట్‌లో సన్నివేశాలు చేసినప్పుడు తన జీవితం, ఇతర విషయాల గురించి మాట్లాడేవాడు నేను తను చెప్పే మాటలు వింటూ కూర్చునేదాన్ని. అయితే సుశాంత్ మరణించారన్న వార్త చూడగానే నాకు నమ్మశక్యం కాలేదని సుశాంత్ మరణం తనని చాలా కాలం పాటు వెంటాడిందని ఈ సందర్భంగా భూమిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus