సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘బిచ్చగాడు’ సినిమా ఇతన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ చేసింది. ఆ సినిమా ఒక్క తెలుగులోనే రూ.14 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసి 10 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. సీడెడ్ లో అయితే మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా కలెక్షన్స్ కూడా అధిగమించి అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇక ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని నటించిన అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏది కూడా అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ‘బిచ్చగాడు-2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని స్వయంగా విజయ్ ఆంటోనీ డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మించడం కూడా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ‘బిచ్చగాడు2’ కి మంచి బిజినెస్ జరిగింది. ఇక్కడ 400 థియేటర్లలో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఒకసారి థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 2.10 cr |
సీడెడ్ | 1.00 cr |
ఉత్తరాంధ్ర | 1.05 cr |
ఈస్ట్ | 0.35 cr |
వెస్ట్ | 0.30 cr |
గుంటూరు | 0.40 cr |
కృష్ణా | 0.45 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.85 cr |
‘బిచ్చగాడు2’ (Bichagadu 2) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.5.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చిన్నదేమీ కాదు. ‘బిచ్చగాడు’ చిత్రం ఫుల్ రన్లో ఏకంగా రూ.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ‘బిచ్చగాడు2’ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా.. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ‘బిచ్చగాడు2’ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!