‘మహాత్మా’ ‘దరువు’ చిత్రాలకు సంగీతం అందించి తెలుగులో పాపులర్ అయిన విజయ్ ఆంటోనీ.. ఆ తర్వాత నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలో 2016 లో వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఊహించని విధంగా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అసలు ‘బిచ్చగాడు’ అనే టైటిల్ తో సినిమా తీయడానికే చాలా మంది ముందుకు రారు.. అలాంటిది ఆ సినిమాతో హిట్టు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయ్ ఆంటోనీ.
ఆ టైంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘బ్రహ్మోత్సవం’ కంటే కూడా ఈ సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టి అందరికీ షాకిచ్చింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ‘బిచ్చగాడు’ సినిమా రూ.3.65 కోట్ల షేర్ ను కలెక్ట్ చేస్తే.. ‘బ్రహ్మోత్సవం’ సినిమా కేవలం రూ.3.10 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టడంతో.. ఆ టైంలో మహేష్ అభిమానులను యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఆడేసుకున్నారు. అయితే దాదాపు 7 ఏళ్ళ తర్వాత ‘బిచ్చగాడు’ కి సీక్వెల్ రాబోతుంది.
ఈ చిత్రానికి విజయ్ ఆంటోనినే దర్శకుడు. అంతేకాక అతనే సంగీత దర్శకుడు స్టోరీ రైటర్, ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ‘శాకుంతలం’ చిత్రానికి పోటీగా ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది.
‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఆంటోని నుండి చాలా సినిమాలు వచ్చాయి కానీ.. ఏవి ఆడలేదు. అందుకే ‘బిచ్చగాడు’ కి సీక్వెల్ తీసి ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈ సినిమా ‘బిచ్చగాడు’ లా కోట్లు కురిపిస్తుందో లేదో చూడాలి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?