Bichagadu 2: దేవుడా.. బిచ్చగాడు తెలుగు మూవీ రైట్స్ ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా?

కొన్నేళ్ల క్రితం విడుదలైన బిచ్చగాడు మూవీ తెలుగు, తమిళ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని హీరోగా శశి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదట ఈ సినిమా టైటిల్ ను చూసి నెగిటివ్ కామెంట్లు చేసిన వాళ్లు ఆ తర్వాత ఈ సినిమా విషయంలో అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.

మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కాకపోయినా బిచ్చగాడు2 టైటిల్ తో విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కుతున్న సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. విజయ్ ఆంటోని మార్కెట్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం ఎక్కువేననే సంగతి తెలిసిందే.

ఈ నెల 19వ తేదీన థియేటర్లలో బిచ్చగాడు2 (Bichagadu 2) రిలీజ్ కానుంది. సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. ఈ నెలలో రిలీజైన సినిమాలలో ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. బిచ్చగాడు2 పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని థియేటర్లకు కళ తెస్తుందేమో చూడాలి.

ప్రతి సంవత్సరం సమ్మర్ లో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేవి. ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ నెలలో పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. బిచ్చగాడు2 సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. విజయ్ ఆంటోని బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus