సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ ఆంటోని.. నటుడిగా మారి ‘నకిలీ’ ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘బిచ్చగాడు’ సినిమా ఇతన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులర్ చేసింది. ఆ సినిమా ఒక్క తెలుగులోనే రూ.14 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసి 10 రెట్లు ప్రాఫిట్స్ ను అందించింది. సీడెడ్ లో అయితే మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా కలెక్షన్స్ కూడా అధిగమించి అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది.
ఇక ‘బిచ్చగాడు’ (Bichagadu2 )తర్వాత విజయ్ ఆంటోని నటించిన అనేక సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏది కూడా అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు ‘బిచ్చగాడు-2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని స్వయంగా విజయ్ ఆంటోనీ డైరెక్ట్ చేయడం విశేషం. మే 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంటే మరికొన్ని గంటల్లో అనమాట. అయితే ఆల్రెడీ కొన్ని చోట్ల ‘బిచ్చగాడు2’ షోలు పడ్డాయి. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని.. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే అని, సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని అంటున్నారు. సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయ్యింది కానీ ప్రీ క్లైమాక్స్ వద్ద గాడి తప్పిందని..చెబుతున్నారు. ఓవరాల్ గా ‘బిచ్చగాడు’ లో ఉన్న ఫన్, ఎమోషన్ ఇందులో లోపించిందని చెబుతున్నారు. అయినప్పటికీ ఒకసారి చూడదగ్గ సినిమా అని చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
#Bichagadu2 First half report: 1st half has thriller elements that engages audience. Missing lip sync is an annoying point though. First half ends with an interesting twist and now th3 fate of the movie depends on how much the 2nd half engages. For live updates and review follow…
— TeluguBulletin.com (@TeluguBulletin) May 19, 2023
Not a sequel, Standalone film. Apt Title though. Kids gud. Poor VFX. Low production values. Screenplay is dull. No emotional connect. Anti Bikili idea nice, Bad execution. Hardly 1/2 interesting scenes in entire film. Total DISAPPOINTMENT! pic.twitter.com/VMUU06IB30
First half is a typical potboiler if we excuse the cinematic liberty. Sathya’s slum life, Vijay’s billionaire life are handled in an engaging manner so far. The film takes off well but turns into an average formulaic film by the interval. pic.twitter.com/te3QAky1vN