Virupaksha: మంచి టైంలో వస్తున్న ‘విరూపాక్ష’..ఆ రికార్డు కొట్టే ఛాన్స్!

గత నెల చివర్లో రిలీజ్ అయిన ‘దసరా’ సినిమా తప్ప బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను సాధించిన మూవీ మరొకటి లేదు. ‘రావణాసుర’ ‘శాకుంతలం’ వంటి బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ‘మీటర్’ ‘రుద్రుడు’ వంటి సినిమాలను జనాలు పట్టించుకోలేదు. ‘గీతా ఆర్ట్స్’ వారు రిలీజ్ చేసిన తమిళ డబ్బింగ్ సినిమా ‘విడుదల-1’ మంచి టాక్ ను సంపాదించుకున్నా.. ఇక్కడి జనాలు పట్టించుకోవడం. ఫైనల్ గా ఏప్రిల్ నెలలో ఒక్క హిట్టు కూడా పడలేదు.

సమ్మర్ సీజన్ పైగా చాలా వరకు పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు అంటే.. జనాలు మంచి ఇంట్రెస్టింగ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అని అర్థమవుతుంది. అది మెగా మేనల్లుడు నటించిన ‘విరూపాక్ష’ అవుతుంది అని కొందరి అభిప్రాయం. ఏప్రిల్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. మొదట ఈ సినిమాపై హైప్ లేదు.

కానీ టీజర్, ట్రైలర్ సినిమాపై (Virupaksha) క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. రుద్రవనం అనే ఓ ఊరు.. అక్కడ జరిగే కొన్ని వింత పరిణామాలు, జనల మూఢనమ్మకాలు చేతబడులు వంటివి ఈ సినిమాలో చూపించబోతున్నారు. హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ మూవీలో హైలెట్ కాబోతున్నాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

రంజాన్ హాలిడే కూడా ఉంది కాబట్టి.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మొదటి రోజు అతని కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ నమోదవడంతో పాటు వీకెండ్ వరకు క్యాష్ చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు కాగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus