Skanda movie: స్కంద సినిమాలో ఇంత పెద్ద తప్పా.. బోయపాటి ఎలా స్పందిస్తారో?

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు, థమన్ బీజీఎం మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బోయపాటి శ్రీను కథ, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేదని చెప్పవచ్చు. రామ్ అభిమానులు మాత్రం ఈ సినిమా తమకు ఎంతగానో నచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే తాజాగా ఈ సినిమా (Skanda )ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. అయితే ఓటీటీలో ఈ సినిమాను చూసిన అభిమానులు ఈ సినిమాలోని ఒక బ్లండర్ మిస్టేక్ ను గమనించి ఆ మిస్టేక్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో సీఎం రోల్ లో నటించిన శరత్ లోహితశ్వ రామ్ మధ్య జరిగే యాక్షన్ సీన్ లో ఒక వ్యక్తిని రామ్ చంపేస్తాడు.

అయితే రామ్ చేతిలో చనిపోయిన వ్యక్తి శరత్ వెనుక ఉన్నట్టు తర్వాత షాట్ లో కనిపించడం గమనార్హం. బోయపాటి శ్రీను జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతుండగా ఎడిటింగ్ లో పొరపాట్ల వల్ల ఈ విధంగా జరిగిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీన్ గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్ల విషయంలో బోయపాటి శ్రీను ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

స్కంద సినిమాకు సీక్వెల్ తీస్తానని బోయపాటి శ్రీను ప్రకటించగా సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీను కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటనల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus