వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుని తన కెరీర్ ని సక్సెస్ తో మొదలు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత చాలా బిజీ హీరోయిన్గా కనిపించింది. చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీకి తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం లభించింది. అయితే స్పైడర్ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ రేంజ్ కూడా ఒక్క సారిగా తగ్గిపోయింది. కానీ ఆ ప్రభావం కేవలం తెలుగులో మాత్రమే చూపించింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతం రకుల్ గ్యాప్ లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో ఈ బ్యూటీ చివరగా 2017లో నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ చూడక పోయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం కంటిన్యూగా అవకాశాలు అందుకుంటోంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి లేడీ ఓరియంటెడ్ సినిమా మొదలు పెట్టేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఆ సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్ 2 కోట్లకు పైగా భారీ స్థాయిలో పారితోషికం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాను కొత్త దర్శకుడు తెరపైకి తీసుకుని రాబోతున్నట్లు సమాచారం. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పదికి పైగా సినిమాలు చేస్తోంది. అందులో ఏడు సినిమాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయి. ఇక చివరగా తెలుగులో చెక్, కొండపొలం అనే సినిమాలు చేసింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు అందుకున్నాయి.
ఏదేమైనప్పటికీ కూడా బాలీవుడ్లో మాత్రం రకుల్ చాలా బిజీ హీరోయిన్ గా కనిపిస్తోంది. మెల్లగా తన పారితోషకం స్థాయిని కూడా పెంచుకుంటుంది. ఇక ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. దీంతో బాలీవుడ్ మీడియా ఫోకస్ మొత్తం రకుల్ పైనే పడింది. మరి ఆ సినిమాతో రకుల్ ఏ విధంగా సక్సెస్ అందుకుంటుందో చూడాలి.