పవన్ కళ్యాణ్ పెద్ద అయోమయంలో ఉన్నారట. దానికి కారణం ఆయన సినిమాల షూటింగ్ లేటు కావడమే అని తెలుస్తుంది. రాజకీయాలలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆర్థిక అవసరాల కోసం మూడు సినిమాలు ఒప్పుకున్నారు. ఆ మూడు సినిమాలు ద్వారా ఓ వంద కోట్లకు పైగా ఆయన ఆర్జించనున్నాడు. చకచగా ఓ నాలుగు సినిమాలు తీసి 2024 ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ భావించాడు. ఐతే ఆయన ఆలోచన దెబ్బతినేలా ఉంది.
కరోనా కారణంగా ఆయన ఒప్పుకున్న మూడు చిత్రాల షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి ఉంది. రోజు రోజుకు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న పక్షంలో ఇప్పట్లో షూటింగ్స్ మొదలుకావడం కష్టమే అన్న మాట వినిపిస్తుంది. ఆయన ఒప్పుకున్న ఆ మూడు సినిమాలు పూర్తి చేయడానికి చాలా సమయం పట్టే నేపథ్యంలో ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడతాయి. జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలంటే పవన్ కి చాలా సమయం కావాలి.
2024 ఎన్నికలకు కేవలం నాలుగేళ్ళ సమయం మాత్రమే ఉంది. సినిమాలకే ఆయన రెండు మూడేళ్లు కేటాయిస్తే పార్టీని 2024 ఎన్నికలకు సన్నద్ధం చేయడం చాలా కష్టం అవుతుంది. షూటింగ్స్ లేటయ్యే పక్షంలో ఏమి చేయాలనేది పవన్ కి పాలు పోవడం లేదట. ఇక వకీల్ సాబ్ పూర్తి కావడానికి 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి వుంది. ఆ సినిమా త్వరగా విడుదలైతే వెండితెరపై చూసి ఆనందించాలని ఆయన ఫ్యాన్స్ ఉత్సాహంలో ఉన్నారు.