శ్రీకాంత్ అడ్డాల.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఇతను ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా వెంకటేష్, మహేష్ బాబు వంటి ఇద్దరు స్టార్ హీరోలతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీస్టారర్ ను తీసి ఆశ్చర్యపరిచాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల డిమాండ్ పెరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ముకుంద’ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి.
ముఖ్యంగా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం శ్రీకాంత్ అడ్డాలని 4 ఏళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరం చేసింది అని చెప్పొచ్చు. ‘అసురన్’ ని ‘నారప్ప’ గా రీమేక్ చేసినా..దాని విషయంలో దర్శకుడిగా శ్రీకాంత్ ప్రత్యేకంగా చూపించింది ఏమీ లేదు. అయితే ‘నారప్ప’ వల్ల ‘పెద కాపు 1’ అనే క్రేజీ ప్రాజెక్టుని తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కానీ సెప్టెంబర్ 29న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.
టైటిల్ తో రేకెత్తించిన క్యూరియాసిటీ సినిమా చూస్తున్నప్పుడు కలగదు. రెండు కులాల మధ్య పోరుని తన స్టైల్లో చూపిస్తాడు శ్రీకాంత్ అనుకుంటే.. ఇందులో ‘బాగా ఉన్నవాడిది ఓ కులం.. బాధింపబడేవాడిది ఇంకో కులం’ అని చెప్పి కథనంలో ఇంటెన్సిటీ లేకుండా చేసేశాడు. ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మినిమం బుకింగ్స్ కూడా జరగడం లేదు. ఇలాంటి టైంలో ‘పెద కాపు 2’ ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పోనీ ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి.. శ్రీకాంత్ అడ్డాలకి అయినా నెక్స్ట్ ప్రాజెక్టు చేసే అవకాశం దక్కుతుందా అనేది కూడా అనుమానమే..! అయినప్పటికీ ‘గీతా ఆర్ట్స్’ సంస్థ శ్రీకాంత్ అడ్డాలకి ఓ అవకాశం ఇవ్వాలని చూస్తుంది. మరి అది సెట్ అయితే.. శ్రీకాంత్ కూడా సెట్ అవుతాడేమో చూడాలి
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !