పొంగల్‌ ఫైట్‌ సీన్‌ ఎలా మారిపోయిందో చూశారా

ఏదో అనుకుంటే… ఇంకేదో అయ్యిందే అంటూ ఓ సినిమాలో పాట ఉంటుంది గుర్తుందా? రానున్న సంక్రాంతి సీజన్‌కి ఆ పాట బాగా సూట్‌ అవుతుంది అనిపిస్తోంది. ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘భీమ్లా నాయక్‌’, ‘రాధే శ్యామ్‌’ లాంటి భారీ చిత్రాల కోసం అభిమానులు వెయిట్‌ చేశారు. అయితే సుదీర్ఘ చర్చల తర్వాత ‘భీమ్లా నాయక్‌’ వెనక్కి తగ్గాడు. పోనీలే రెండు సినిమాలతోనైనా సర్దుకుందాం అని అందరూ ఫిక్సయ్యారు. అయితే ఒమిక్రాన్‌ పరిస్థితుల వల్ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా వెనక్కి వచ్చేయాలని నిర్ణయించింది.

దీంతో సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ చిన్నపాటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేదో అనుకుంటే ఇలా అయిపోయిందేంటి అంటూ తమ బాధను మీమ్స్‌ రూపంలో చూపిస్తున్నారు. ఎలాంటి సినిమాలు చూద్దాం అనుకున్నాం, ఆఖరికి ఎలాంటి సినిమాలు చూస్తున్నాం అంటూ మీమ్స్‌లో బాధను వెళ్లగక్కుతున్నారు. కొందరు ‘లక్ష్మీ’ సినిమాలో వేణుమాధవ్‌ స్టైల్‌లో బాధను చెబితే… ఇంకొందరు… ‘ఢీ’ సినిమాలో సునీల్‌ లాగా ‘మీరెందుకొచ్చారు’ అంటూ కసురుకునేలా మీమ్స్‌ రెడీ చేశారు. ‘భీమ్లా నాయక్‌’ను వెనక్కి వెళ్లేలా చేసి మరీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తీసుకొస్తామనుకున్నారు.

అయితే ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమానే వెనక్కి వెళ్లింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఇప్పటివరకు చెప్పిన రిలీజ్‌ డేట్స్‌ను చూపిస్తూ వ్యంగ్యంగా వీడియోలు రూపొందించారు. కరోనా దెబ్బ నుండి ‘పుష్ప’ తప్పించుకుంది అంటూ కొందరు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కొత్త పేరు పెడుతూ ఇంకొందరు మీమ్స్‌ రెడీ చేశారు. అలాంటి కొన్ని మీమ్స్‌, మీమ్‌ వీడియోలు మీరూ చూసేయండి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus