సూర్య సినిమాలను బ్యాన్ చేస్తారంట… కారణం అదే…!

  • May 6, 2020 / 05:17 PM IST

లాక్ డౌన్ సమయంలో సూర్యకు ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడ్డాయి. ‘ఆలయాల కంటే ముందు… స్కూల్స్, హాస్పిటల్స్ ను మనం బాగు చేసుకోవాలి’ అంటూ సూర్య భార్య జ్యోతిక చేసిన కామెంట్స్ పెద్ద ధుమరమే రేపాయి. ఈ విషయం పై సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. దాంతో జ్యోతిక పై ఎక్కువగా ట్రోల్స్ జరిగాయి. ఈ క్రమంలో సూర్య కూడా తన భార్యను వెనకేసుకు వచ్చాడు. అతన్ని కూడా ట్రోల్ చేసారు కానీ అతని అభిమానులు సూర్య కు మద్దతు పలికారు.

ఇదిలా ఉంటే.. జ్యోతిక ప్రధాన పాత్రలో ‘పొన్ మగల్ వందాల్’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి నిర్మాత.. సూర్యనే కావడం విశేషం.అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలను డైరెక్ట్ గా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా … మంచి ఆఫర్ రావడంతో ‘పొన్ మగల్ వందాల్’ చిత్రాన్ని ఆన్లైన్ లో విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. అయితే థియేటర్ల యాజమాన్య సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆ చిత్రాన్ని ఆన్లైన్ లో విడుదల చేస్తే.. అదే బ్యానర్ లో రాబోయే సినిమాల్ని తమ థియేటర్ లలో ప్రదర్శించమని హెచ్చరించారు. అయితే తమిళ ఇండస్ట్రీ కి చెందిన కొందరు నిర్మాతలు సూర్యకు అండగా నిలబడ్డారని తెలుస్తుంది. ‘నెలకి లక్షలు లక్షలు ఇంట్రెస్ట్ లు కట్టే నిర్మాతల గురించి ఆలోచించాలి అని వారు’ కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు సూర్యకు మరో షాక్ తగిలిందని సమాచారం. ‘పొన్ మగల్ వందాల్’ చిత్రాన్ని ఆన్లైన్ లో విడుదల చేస్తే సూర్య రాబోయే చిత్రాలని ఇక్కడ ప్రదర్శించం. ఆయన సినిమాల్ని బ్యాన్ చేస్తాం అంటూ హెచ్చరించారు. దీంతో సూర్య అండ్ టీం ‘పొన్ మగల్ వందాల్’ చిత్రాన్ని ఆన్ లైన్ లో విడుదల చెయ్యాలి అనే ఆలోచన విరమించుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus