స్టార్ హీరోయిన్లు ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగానే వాళ్ళు కాల్ షీట్లు ఇస్తుంటారు. ఇలా చెయ్యడం వలన నెల పూర్తయ్యేసరికి వీళ్ళ సంపాదన ఎక్కువగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే కేవలం సినిమాల ద్వారానే కాదు షాపింగ్ మాల్స్ వంటి వాటికి ఓపెనింగ్స్ కు వెళ్లడం ద్వారా కూడా వీళ్లకు డబ్బులు అందుతుంటాయి. సాధారణంగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హీరోయిన్లు వెళితే.. రూ.1 లక్ష నుండీ రూ.10 లక్షల వరకూ ఛార్జ్ చేస్తుంటారు.
ఒకటి రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్లకు కూడా రూ.1 లక్షకు తక్కువ ఉండదట. అలా నాలుగైదు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళితే.. వీళ్లకు బాగానే గిట్టుబాటు అయ్యేది. కానీ కరోనా కారణంగా ఇప్పుడు వీళ్ళ సైడ్ బిజినెస్ కు పెద్ద దెబ్బె పడింది. సోషల్ డిస్టెన్స్ పాటించాలి.. కరోనా నిబంధనలు ఎలాగు ఉన్నాయి.. కాబట్టి ఈ టైములో వారిని రిబ్బన్ కట్ చెయ్యడానికి ఆహ్వానించేవారు లేరు. గతేడాది నుండీ హీరోయిన్లకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడినట్టు అయ్యింది.
కరోనా వైరస్ ఎఫెక్ట్ ను పక్కన పెట్టినా.. భవిష్యత్తులో హీరోయిన్లను షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు పిలిచే ట్రెండ్ తగ్గుముఖం పట్టె అవకాశం ఉందట. హీరోయిన్లు వస్తారనే ఊపులో జనాలు వస్తారు..ఆ పబ్లిసిటీతో సేల్స్ బాగా పెరుగుతాయి అనే ఊహ తప్ప.. ఇప్పుడు ఆ స్థాయిలో బిజినెస్ జరగడం లేదట. పైగా జనాలు కూడా ఇలాంటి వాటికి పొంగిపోయే ట్రెండ్ కు దూరమవుతున్నారని స్పష్టమవుతుంది.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!