బిగ్ బాస్ 5: విన్నర్ అవుతాడు అనుకుంటే తలక్రిందులు అయిందిగా..!

బిగ్ బాస్… కు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గడిచిన నాలుగు సీజన్లలో నమోదైన టి.ఆర్.పి ల కంటే కూడా ఎక్కువగా బిగ్ బాస్ 5 కి నమోదు అయ్యింది అనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఎన్నడూ లేని విడ్డూరాలు కూడా ఈ సీజన్ లలోనే జరిగాయి. స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ లు అందరూ ముందే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. దాంతో ఎవరు విన్నర్ అవుతారు అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది.

మొత్తానికి సిరి, షణ్ముక్, సన్నీ, మానస్, శ్రీరామ్ చంద్ర వంటి వారు టాప్ 5 లో చేరారు.వీళ్లలో ఎవరు విన్నర్ అవుతారు అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే సీజన్ ప్రారంభం నుండీ చూసుకుంటే రవి, షణ్ముక్ లలో ఒకరు విన్నర్ అవుతారు అని అంతా భావించారు. ఎందుకంటే నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతీసారి ఎక్కువ ఓట్లు వీళ్ళకే పడేవి. అయితే అనూహ్యంగా 80 రోజులకే ఎలిమినేట్ అయ్యాడు.

ఆ క్రమంలో షణ్ముక్ విన్నర్ అవుతాడు అని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. షణ్ముక్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. సిరి తో ఓవర్ రొమాన్స్ కారణంగా అతన్ని జనాలు పట్టించుకోవడం మానేసారు అని కొంతమంది అంటుంటే..దాంతో పాటు గేమ్ ఆడకుండా నిబ్బా వేషాలు వేశాడని అందుకే షణ్ముక్ గ్రాఫ్ పడిపోయిందని పేర్కొంటున్నారు. అన్నీ ఎలా ఉన్నా అతను విన్నర్ అవుతాడు అని మొదటి నుండీ అనుకుంటే

అతను టాప్ 2 పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు అని … సిరి ఎలిమినేట్ అయిన తర్వాత మానస్, అటు తర్వాత శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అవ్వగా షన్ను టాప్ 2 పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు అని తెలుస్తుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus