సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సినిమాలు ఇవేనా..?

2020 సంక్రాంతికి కరోనా అడ్డంకి రావడం వల్ల పెద్ద హీరోల సినిమాలు ఏవీ రాలేదనే చెప్పాలి. వచ్చిన సినిమాల్లో క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ పర్వాలేదనిపించాయి. అలాగే తమిళ డబ్బింగ్ సినిమా అయిన మాస్టర్ కూడా మంచి కలక్షన్స్ ని సాధించింది. కేవలం 50శాతం ఆక్యుపెన్సీ ఉంటేనే ఇలా ఈరేంజ్ లో కలక్షన్స్ వస్తే తర్వాత వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఏ రేంజ్ లో కలక్షన్స్ రాబోతున్నాయో అర్ధం అవుతోంది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు సర్కారివారి పాట సినిమా మాత్రమే సంక్రాంతి రేస్ లో ఎనౌన్స్ అయ్యింది. అయితే, ఈసారి సూపర్ స్టార్ తో పోటీగా మేము కూడా బరిలో ఉంటామంటూ స్టార్ హీరోలు సైతం పోటీ పడే అవకాశం ఉందట.

ఇక సంక్రాంతి పండగ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే సినీపరిశ్రమకు కూడా సినిమాల పరంగా అంతే ఇంపార్టెంట్. కలక్షన్స్ తో కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ టైమ్ లో వచ్చే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా మాత్రం ఢోకా ఉండదు. అందుకే ముందుగా బెర్త్ రిజర్వ్ చేస్కున్న మహేష్ తో కలిసి ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడబోతున్నారు. వాళ్లెవరో కాదు పవర్ స్టార్, రెబల్ స్టార్, యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్నాడు. సింగరేణి ఏరియాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఉండేలాగానే కనిపిస్తోంది.

అలాగే యంగ్ టైగర్ రెండో సారి త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న సినిమా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో రానున్న సినిమా కూడా సంక్రాంతినే టార్గెట్ చేసేలా కనిపిస్తోంది. మరోవైపు క్రిష్ డైరక్షన్ లో పవర్ స్టార్ నటిస్తోన్న సినిమా కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఇప్పుడు సూపర్ స్టార్ కి పోటీగా ముగ్గురు స్టార్లు బరిలోకి దిగుతున్నారని సినీనగర్ లో హాట్ న్యూస్ హడావుడి చేస్తోంది. మరి ఈ సినిమాల డేట్స్ కన్ఫార్మ్ చేస్తేనే కానీ ఏ సినిమా ఎప్పుడు అనేది క్లారిటీ రాదు. అదీ మేటర్.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus