కేవలం ఆ ఆరుగురు ఉన్నారు మిగిలిన వాళ్ళు ఎక్కడ..!
- November 16, 2019 / 01:42 PM ISTByFilmy Focus
‘బిగ్ బాస్3 ఫినాలే’ కు టి.ఆర్.పి ఓ రేంజ్ లో వచ్చింది. ఎంతో గ్రాండ్ గా నిర్వహించడం.. కొందరి హీరోయిన్లతో డ్యాన్స్ లు చేయించడం వంటితో పాటు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడం కూడా మంచి టి.ఆర్.పి రావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తెలుగు నాట ‘బిగ్ బాస్’ చాలా పాపులర్ అయ్యింది. ప్రతీ ప్రేక్షకుడు రాత్రికి ‘బిగ్ బాస్’ కోసం ఎంతో ఆసక్తితో చూసేవారు. ‘బిగ్ బాస్’ అయిపోవడం బోర్ అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే… తాజాగా ‘బిగ్ బాస్3’ కంటెస్టెంట్ లు రీ యూనియన్ అయ్యి పార్టీ చేసుకోవడంతో డిస్కషన్లు మొదలయ్యాయి.

ఎందుకంటే.. ఈ పార్టీకి కేవలం ఆరుగురు కంటెస్టెంట్ లు మాత్రమే హాజరయ్యారు. వరుణ్ సందేశ్, వితిక షెరు, మహేష్ విట్టా, హిమజ, పునర్నవి భూపాలం, అలీ రెజా వంటి వారు మాత్రమే హాజరయ్యారు. కేవలం ఈ ఆరుగురు మాత్రమే హాజరయ్యారు.. మిగిలిన వాళ్ళు ఏమైనట్టు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. బహుశా వారు షూటింగ్ లలో బిజీగా ఉండొచ్చు అనేది కొందరి సమాధానం. ఏమైతేనేం.. ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా లుక్కెయ్యండి.
View this post on Instagram
#BiggBoss3 contestants re-union party!
A post shared by Filmy Focus (@filmyfocus) on
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30















