బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో అందరు పార్టిసిపెంట్స్ వారి జీవితంలో దాచి ఉంచిన సీక్రెట్స్ ని బయటపెట్టారు. అలా సీక్రెట్స్ చెప్తేనే వారికి ఇంటినుంచి వచ్చిన లెటర్ అందుతుందని కండీషన్ పెట్టాడు బిగ్ బాస్ . అంతేకాదు, ఆ బాధ్యతని సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ సార్ధక్ కి అప్పజెప్పాడు. దీంతో అఖిల్ అందరి సీక్రెట్స్ వింటూ ఎవరు జెన్యూన్ గా చెప్తున్నారో గెస్ చేశాడు. అవినాష్ కి, అరియానాకి లెటర్స్ పంపలేదు అఖిల్.
ఇకా లాస్ట్ లో వచ్చిన మోనాల్ తను కుటుంబం కోసం ఎడ్యుకేషన్ ని శాక్రిఫైజ్ చేశానని చెప్పింది. మా నాన్నగారు చనిపోయినపుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ క్వాలిఫికేషన్ తో జాబ్ రావట్లేదు. అప్పుడు రిజల్డ్స్ వచ్చాయి.. జాబ్ ప్రయత్నిస్తే వచ్చింది. తరువాత బికాం లో ఎడ్మిషన్ తీస్కున్నాను. కాలేజ్ టైమింగ్ అలాగే జాబ్ టైమింగ్ సెట్ అవ్వలేదు. పైనల్ ఎగ్జామ్స్ నేను రాయలేకపోయాను. వదలిశాను. అలా కుటుంబం కోసం నా ఎడ్యుకేషన్ ని నేను డ్రాప్ చేస్కున్నాను అని చెప్పి బాధపడింది.
ఆతర్వాత సోహైల్ వచ్చి కాస్త ఫన్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రామా గురించి చెప్పాడు. 4 సంవత్సరాల క్రితం పబ్ కి వెళ్లి డ్రింక్ చేసి వస్తుంటే టోలిచౌకీ దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేశారు. అక్కడ 102 రీడింగ్ వచ్చింది. పొద్దున్నే వెళ్లి చలాన్ కట్టాను. తర్వాత కోర్డ్ స్లాట్ తీస్కున్నాను. కానీ, అక్కడే ట్విస్ట్ ఇచ్చారు. పేరెంట్స్ ని తీస్కోమని చెప్పారు. దీంతో డూప్లికేట్ పేరెంట్స్ ని సృష్టించాను. కానీ ఐడీకార్డ్స్ కావాలంటే ఆలోచనలో పడ్డాను. ఇక కోర్డ్ కి వెళితే అక్కడ అందరూ నీ రీడింగ్ ఎంత ? నీ రీడింగ్ ఎంత అని అడుగుతున్నారు. ఏదో ర్యాంక్స్ వచ్చినట్లుగా అందరూ అలా ఉండటం చూసాక ఏం చేయాలో తెలియక తమ్ముడ్ని తీస్కుని వెళ్లాను. తమ్ముడికి వార్నింగ్ ఇచ్చా అమ్మా – నాన్నకి ఈ విషయం చెప్పకు అని చెప్పాను. అని సోహైల్ తన సీక్రెట్ ని పంచుకున్నాడు.
ఇక మోనాల్ కి, సోహైల్ కి లెటర్స్ పంపించాడు అఖిల్. ఈ లెటర్స్ తీసుకున్న పార్టిసిపెంట్స్ ఎమోషనల్ అయ్యారు. మోనాల్ – సోహైల్ చేసిన ఫన్ బాగా ఆకట్టుకుంది.