బిగ్‌బాస్‌ 4 – 18వ రోజు రివ్యూ : ‘రోబో’ సినిమా హిట్‌.. నోయల్‌ పని ఫట్‌!

  • September 25, 2020 / 09:09 AM IST

ఫిజికల్‌ టాస్క్‌ పడితే ఎవరి రంగేంటో బయట పడుతుంది అని బిగ్‌బాస్‌ ప్రేక్షకులు అంటుంటారు. ఈసారి కూడా అదే జరిగింది. బిగ్‌బాస్‌ ముందు రేలంగి మావయ్య లాగా నవ్వుతూ ఉన్న చాలా మంది అసలు రూపం ఈ టాస్క్‌తో బయటికొచ్చేసింది. ఎవరికి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తెలివి ఎక్కువ… ఇలా చాలా విషయాలు బయటికొచ్చాయి. ఇంకా 18వ రోజు ఏం జరిగిందంటే?

తీవ్ర పోరాటం, స్మార్ట్‌ థింకింగ్‌తో ‘ఉక్కుహృదయం’ టాస్క్‌ను విజయవంతంగా రోబోల టీమ్‌ గెలుకుంది. మనుషుల టీమ్‌ లేజీనెస్‌ అనాలో లేక అతి నమ్మకం అనాలో కానీ… వాళ్లే చేజేతులా ఓడిపోయారు. దీంతో ఈసారి కెప్టెన్సీ పోటీలో రోబోల టీమ్‌ నిలిచింది.

Click Here -> ఉక్కు హృదయం టాస్క్‌ తొలి రోజు ఏం జరిగిందంటే?

Click Here -> ఉక్కు హృదయం టాస్క్‌ రెండో రోజు ఏం జరిగిందంటే?

రెండో రోజు అభిజీత్‌ ఆడిన స్మార్ట్‌ గేమ్‌తో బోల్తాపడి దివిని ఇంట్లోకి వెళ్లింది. దీంతో అభి రోబో ఛార్జింగ్‌ పెట్టుకున్నాడు. ఇక రెండో రోజు అవినాష్ స్మార్ట్‌గా తన పని కానిచ్చేశాడు. అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌, మెహబూబ్‌, దివిని మాటల్లో పెట్టి మాస్టర్‌ నుంచి ఛార్జింగ్‌ కొట్టేశాడు. ఫుడ్‌ ఇచ్చి గంగవ్వ రోబో ఛార్జింగ్‌ పెట్టుకుంది. కాసేపటికి అరియానా, కుమార్‌సాయి, హారిక, అవినాష్‌, లాస్య రోబోలు తొలుత చనిపోయాయి. ఆఖరికి అభి, గంగవ్వ ఛార్జింగ్‌ మిగలడంతో ఈ టాస్క్‌లో రోబోల టీమ్‌ గెలిచింది.

టాస్క్‌లో జరిగిన సీరియస్‌ విషయాలు చూస్తే… రోబోల మైక్‌లు వాష్ రూమ్‌లో ఉండిపోవడంతో తెచ్చుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో మనుషుల టీమ్‌ అక్కడే ఉండి అందరినీ అడ్డగించారు. ఈ క్రమంలో ఆరియానా, మోనాల్‌ మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత లాస్య, మోనాల్‌ మధ్య లాక్కోవడాలు జరిగి ఇద్దరూ పడిపోయారు. ఈలోపు గంగవ్వ రోబో షూట్‌ను లాక్కొని మోనాల్‌ పరిగెత్తింది. దీంతో గంగవ్వకు కోపం వచ్చి కుర్చీ ఎత్తి గిరటేసింది. ఇది కచ్చితంగా వీకెండ్‌లోను, వచ్చే నామినేషన్‌ మీద ప్రభావం చూపిస్తుంది.

సరదా విషయాలకొస్తే… అవినాష్‌ రోబో చనిపోయాక… అవినాష్‌ వాష్‌ రూమ్‌ దగ్గరకు వచ్చి అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ను కూల్ చేయాలని చూశాడు. కానీ మాస్టర్‌ అస్సలు ఎంటర్‌టైన్‌ చేయలేదు. టాస్క్‌లో వరస్ట్‌ పర్‌ఫార్మర్‌గా నిలిచిన నోయల్‌ను బిగ్‌బాస్‌ జైలుకు పంపించాడు. జైలుకెళ్లే సమయంలో నోయల్‌ యాటిట్యూడ్‌, హౌస్‌మేట్స్‌ రియాక్షన్‌ కాస్త నవ్వు తెప్పించింది. ఆఖరులో జైలు గురించి నోయల్‌ పాడిన పాట జోష్‌ నింపింది.

మోనాల్‌ మనసు విరిగింది…

టాస్క్‌లో అభిజీత్‌ చేసిన పని నచ్చక మోనాల్‌ కిచెన్‌ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయిచుకుంది. రేషన్‌ మేనేజర్‌గా అభిజీత్‌ ఉన్నప్పుడు నేను ఫేస్‌ చేయను అని చెప్పింది. నోయల్‌ ఆ తర్వాత మోనాల్‌కు నచ్చజెప్పాలని చూసినా వినలేదు. ఆ తర్వాత దేవీ నాగవల్లి కూడా మోనాల్‌కు ‘ఇదంతా టాస్క్‌’ అంటూ మైండ్‌ క్లియర్‌ చేయాలని చూసింది. చూద్దాం మోనాల్‌ ఆలోచన ఎలా ఉంటుందో.

అభిజీత్‌ను హారిక నడిపిస్తోందా?

బిగ్‌బాస్‌లో ఒకరి గైడెన్స్‌లో ఒకరు నడుస్తారు అనుకోవడం అన్నిసార్లు కరెక్ట్‌ కాదు. గత సీజన్లలోనే అది తెలిసింది. ఈ సీజన్‌లోనూ అలాంటి ఆరోపణలు వస్తున్నాయి. హారిక డైరక్షన్‌లో అభిజీత్‌ నడుస్తున్నాడని దేవీతో మోనాల్‌ చెప్పింది. ‘నేను అభిజీత్‌తో మాట్లాడదామని చూస్తే.. మధ్యలో హారిక ఎంటర్‌ అవుతోంది’ అంటూ దేవీకి చెప్పింది. ఆ తర్వాత అవినాష్‌, సుజాత, లాస్య దగ్గర అమ్మ రాజశేఖర్‌ కూడా అదే మాట అన్నారు. ‘అభిజీత్‌ను హారిక కంట్రోల్‌ చేస్తోంది’ అని చెప్పారు. అయితే ముందుగా అభిజీత్‌ చెప్పినట్లు ప్రేక్షకులే చూస్తారు లెండి.

కెప్టెన్‌ పోటీదారులు వీరే…

‘ఉక్కు హృదయం’ టాస్క్ లో ఉత్తమ ప్రదర్శన వచ్చిన పార్టిసిపెంట్స్‌గా ఇంటి సభ్యులు గంగవ్వ, అవినాష్‌, అభిజీత్‌, హారికను ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. దీంతో వీరు వచ్చే వారం కెప్టెన్ అయ్యే పోటీకి అర్హులయ్యారు. అలాగే వరస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చిన హౌస్‌మేట్‌గా నోయల్‌ను ఇంటి సభ్యులు ఎంచుకున్నారు. దీంతో నోయల్‌ను జైలుకు పంపించారు.

ఇవి బిగ్‌బాస్‌నే చెప్పాలి…

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎవరి మైక్‌లు వాళ్లే ధరించాలి అని అంటారు. కానీ ఆరియానా మైక్‌ ధరించనప్పుడు బిగ్‌బాస్‌ హెచ్చరించాడు. అప్పుడు దేవీ నాగవల్లి వచ్చి తన మైక్‌ ఇచ్చింది. గంగవ్వ కూడా కాసేపు మైక్‌ ధరించలేదు. లాస్య తన మైక్ బదులు ఆరియనా మైక్ ధరించింది. మరి బిగ్‌బాస్‌ ఆ ఊసే ఎత్తలేదు. మనుషులను అడిగి ఛార్జి పెట్టుకోవాలి, వాళ్లకు అవసరమైన సౌకర్యాలు ఇవ్వాలి అని రూల్స్‌లో బిగ్‌బాస్‌ చెప్పాడు. కానీ దొంగతనంగా, కిడ్నాప్‌లు చేసి ఛార్జింగ్‌ పెట్టొచ్చు అని అందులో లేదు. మరి వాటిని ఎందుకు ప్రశ్నించలేదో బిగ్‌బాసే చెప్పాలి. చనిపోయిన రోబో దేవీ… ఇంకా రోబో డ్రెస్‌ ఎందుకు వేసుకుని ఉందో తెలియదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus