ఏంటి ఈ సినిమా ఎప్పుడు వచ్చిందా అని అనుకుంటున్నారా… బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకులకి ఈ సినిమా చాలా పరిచయమే. చూడద్దు అనుకున్నా కూడా ప్రీమియర్ షో వేసి మరీ ఎపిసోడ్ లో చూపించింది మూవీ టీమ్ అందా.. అందరూ చూశారు కూడా. పైగా దీనికి ప్రీమియర్ షోకి ముందు ఇంటర్య్వూలు , అలాగే సినిమా రిలీజ్ అయ్యాక అవార్డులు గోల తో హౌస్ అంతా దద్దరిల్లిపోయింది. ఇక మనం డైరెక్ట్ గా సినిమా రివ్యూలోకి వెళ్లిపోతే..,
అఖిల్ అంటే హీరో అఖిల్ కాలేజ్ స్టూడెంట్ అన్నమాట… స్రవంతి అంటే మన హీరోయిన్ మోనాల్ అఖిల్ ని మూగగా ప్రేమిస్తుంటుంది. ఇదే కాలేజ్ లో పోకిరి మాన్ మెహబూబ్.. బోల్డ్ బ్యూటీ సుబ్బలక్ష్మి అంటే మన అరియనా. సుబ్బలక్ష్మి కూడా అఖిల్ ని ప్రేమిస్తుంటుంది. ఒకరోజూ ఊరి నుంచి వచ్చిన ఏడుకొండలు అంటే మన కమెడియన్ ముక్కు అవినాష్ వరసకి సుబ్బలక్ష్మి బావ తన ప్రేమని సుబ్బలక్ష్మి ముందు పెడతాడు. సుబ్బలక్ష్మి మొహమాటం లేకుండా రిజక్ట్ చేస్తుంది. చదువు సంధ్య లేని నీతో నాకు పెళ్లేంటి అని చెప్పి అవమానిస్తుంది. ఇదే టైమ్ లో పోకిరాజా అయిన మెహబూబ్ సుబ్బలక్ష్మి ని అల్లరి చేస్తాడు. ఇది తట్టుకోలేని బావ ఏడుకొండలు మెహబూబ్ తో తలబడతాడు, తన్నులు తింటుంటాడు.., ఇది చూసిన స్రవంతి అఖిల్ ని తీస్కుని వచ్చి మెహబూబ్ ని కొట్టి జైల్లో పారేయిస్తుంది.
జైల్ కెళ్లిన మెహబుూబ్ పగబడతాడు.. ఇంటర్వెల్ అన్నమాట.
తర్వాత సుబ్బలక్ష్మి రియలైజ్ అయ్యి బావని పెళ్లిచేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఇదే టైమ్ లో మోనాల్ అఖిల్ కి తన ప్రేమవిషయం చెప్తుంది. ఈలోగా జైల్ నుంచి తప్పించుకుంటాడు మెహబూబ్. ఫలానా దాబాలో ఉన్నాం రమ్మని చెప్తుంది సుబ్బలక్ష్మి. కట్ చేస్తే సోహైల్ – హారికల ఐటమ్ సాంగ్. అక్కడికి వచ్చిన మెహబూబ్ మోనాల్ ని, సుబ్బలక్ష్మిని చంపాలని అనుకుంటాడు. ఫైనల్ గా అఖిల్ పోరాడి మెహబూబ్ కి బుద్ది చెప్తాడు. ఇక్కడే సుబ్బలక్ష్మి ఏడుకొండలని, అలాగే స్రవంతి – అఖిల్ ని పెళ్లి చేస్కుందామని డిసైడ్ అవుతారు. ఇక్కడితో శుభంకార్డ్.
హమ్మయ్యా.. సినిమా స్టోరీ అయిపోయింది అనుకుంటే.. ఆ తర్వాత అవార్డ్స్ తో హౌస్ మేట్స్ పిచ్చెక్కించారు. ఒక్కో కేటగిరికి అవార్డ్స్ ఇస్తూ ఐఫా అవార్డ్స్ వచ్చినంత సంతోషపడ్డారు.
తర్వాత డ్యాన్స్ లతో కూడా రెచ్చిపోయారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది.. ఎన్ని స్టార్స్ ఇద్దాం అనేది ప్రేక్షకులే డిసైడ్ చేయాలి. ఇక కెమెరా లేని కెమారమాన్, యాక్షన్ మాత్రమే చెప్పే డైరెక్టర్ , స్క్రిప్ట్ ఉంది కానీ కోపరేట్ చేయలేదు అనే రైటర్, ఐటమ్ సాంగ్ దొరికిందేట్రా బాబు అనుకునే క్యారెక్టర్స్. ఈ సినిమాలో నాకు అస్సలు ఇంపార్టెన్స్ లేదు అనుకునే హౌస్ మేట్స్.. ఇలా అందరూ టీమ్ వర్క్ చేసి మరీ సినిమాని ప్రజెంట్ చేశారు.
అసలు ఇంతలా దీన్ని గంటన్నరపాటు చూపించాల్సిన అవసరం ఉందా.. అనేది సగటు బిగ్ బాస్ లవర్ ఆవేదన. అదీ మేటర్. మరిన్ని ఇంట్రస్టింగ్
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!