బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: తొమ్మిదో రోజు ఏం చూపించారంటే?

బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌లో రోజులు పెరిగే కొద్దీ మజా పెరుగుతుంది. అయితే ఈ సీజన్‌లో ఏమైందో ఏమో కానీ బోర్‌ పెరుగుతోంది. సరైన కాన్సెప్ట్‌లు లేక, ఎమోషన్‌లు, డ్రామాలు పండక విసుగొస్తోంది. తొమ్మిదో రోజు కూడా పాత పరిస్థితే. హారిక మార్నింగ్‌ మస్తీతో హుషారు తీసుకొచ్చినా… తర్వాత చప్పగా సాగిపోయింది. ఈ రోజు ఇంకా ఏమైందంటే…

* బిగ్‌బాస్‌ ఇచ్చిన కనెక్షన్‌లో అభిజీత్‌, హారిక పర్‌ఫెక్ట్‌గా కంటిన్యూ అవుతున్నారు. భోజనం చేయకుండా నిద్రపోవడానికి సిద్ధమవుతున్న అభిజీత్‌కు హారిక భోజనం పెట్టింది. ఎంతో అభిమానంతో తిండి మానేసి ప్రొటీన్‌ షేక్‌ తాగితే ఏమొస్తుంది అంటూ గోరు ముద్దలు కలిపి పెట్టింది. ‘టేస్ట్‌ చూడు’ అంటూ అన్నం కలిపి అభిజీత్‌ ఖాళీ కడుపుతో నిద్రపోకుండా చూసుకొంది. ఇది కదా… అభిమానం అంటే.

* భోజనం తర్వాత ఇంట్లో వాళ్లంతా బెడ్‌రూమ్‌లో కలసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే నోయల్‌ ‘కన్నుల్లో నీ రూపమే..’ అంటూ పాట అందుకున్నాడు. దానికి కళ్యాణి, అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కూల్‌ స్టెప్పులేశారు. కళ్యాణి హీరోయిన్‌ రేంజిలో వయ్యారంగా కూర్చుంది. రాజశేఖర్‌ అంతే ప్రేమగా వచ్చి చేతిలో బకెట్‌ పక్కనపెట్టి కళ్యాణి వేలు అందుకోబోయారు. ఈలోగా కళ్యాణిని చూసి షేక్‌ అయ్యి… కింద పడిపోయారు. ఆ తర్వాత మరోసారి రాజశేఖర్‌ – కళ్యాణి పాటకు పర్‌ఫార్మెన్స్‌ స్టార్ట్‌ చేశారు. కళ్యాణి లిరిక్‌కి తగ్గట్టుగా ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా ఇచ్చారు. అయితే రాజశేఖర్‌ మాస్టర్‌ దానినీ చెడగొట్టారు.

* తన రిలేషన్‌షిప్స్‌ గురించి అభిజిత్‌ – మోనాల్‌ మాట్లాడుకున్నారు. తనకు 3 సీరియస్‌ రిలేషన్‌షిప్స్‌ ఉన్నాయని అభిజిత్‌ చెప్పాడు. తనకు ఓ సీరియస్‌ రిలేషన్‌షిప్స్‌ ఉందని మోనాల్‌ చెప్పింది. ‘నాతో మాట్లాడు… అంతేకానీ ముఖం తిప్పుకొని వెళ్లొద్దు’ అని మోనాల్‌తో అభిజీత్‌ అన్నాడు. ‘నువ్వు సింగిలా’ అని మోనాల్‌ను అభిజీత్‌ అడిగితే… ఆమె క్లారిటీగా సమాధానం ఇవ్వలేదు.

* ఉదయం ‘బ్లాక్‌బస్టర్‌…’ పాటతో బిగ్‌బాస్‌ గుడ్‌మార్నింగ్‌ చెప్పాడు. మళ్లీ అఖిల్‌ ఒంటరివాడు అయిపోయాడు. ఇంట్లో వాళ్లందరూ ఒక దగ్గర డ్యాన్స్‌లు వేస్తుంటే… అఖిల్‌ మాత్రమే సింగిల్‌గా ఉన్నాడు. ఇంట్లో మోనాల్‌ – అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులేశారు.

* దేవీ నాగవల్లి – కెప్టెన్‌ లాస్య మధ్య ‘రేషన్‌ మేనేజర్‌’ ఇష్యూ ఇంకా క్లియర్‌ అవ్వలేదు. నిన్న చెప్పిన విషయాన్నే దేవి మళ్లీ రెయిజ్‌ చేసింది. కిచెన్‌లో ఉన్న వారికి ఒకరిని కనెక్ట్‌ చేసి… రేషన్‌ మేనేజర్‌గా చేసుంటే బాగుంటుంది అని చెప్పింది. దీనిపై మరోసారి చర్చ జరిగినా… నిర్ణయంలో మార్పు లేదు.

* రొమాంటిక్‌ ట్యాగ్‌ కోసం… అఖిల్‌ అందరి అమ్మాయిలతో సరదాగా ఉంటున్నాడని, అందరినీ పొగుడుతున్నాడని దివి పంచ్‌ వేసింది. దానికి సోహైల్‌, మెహబూబ్‌ కూడా సపోర్టు చేశారు. పులిహోర రాజా అంటూ బిరుదు కూడా ఇచ్చేశారు. అఖిల్‌ నిమ్మకాయ పులిహోర అయితే, సోహైల్‌కు చింతపండు పులిహోర అని పేరు పెట్టారు.

* మార్నింగ్‌ మస్తీలో భాగంగా అందరినీ అలరించాలని హారికకు టాస్క్‌ ఇచ్చారు . కళ్యాణి పాట పాడితే హారిక డ్యాన్స్‌ వేసి అలరించింది. ఇప్పటికింకా నా వయసు ఇంకా పదహారే అనే పాట పాడగా… దానికి తగ్గట్టుగా హారిక హాట్‌ హాట్‌ స్టెప్పులేసింది. అందరూ చప్పట్ల మోతతో అభినందించారు. హారిక గురించి నోయల్‌ ఓ ర్యాప్‌ పాడి స్టెప్పలేయించాడు. అఖిల్‌, హారిక కోసం ‘అదిరేటి డ్రెస్సు మీరేస్తే..’ అంటూ హౌస్‌ మేట్స్‌ పాట పాడారు. దానికి ఇద్దరూ వావ్‌ మూమెంట్స్‌ వేశారు.

* మస్తీలో నోయల్‌తో కలసి హారిక టాస్క్‌ వేసింది. హారిక – నోయల్‌ పెళ్లి చేసుకోవడానికి వాళ్ల బామ్మ గంగవ్వ దగ్గరకు వచ్చేలా స్కిట్‌ అనుకున్నారు. అయితే తొలి డైలాగ్‌తోనే గంగవ్వ పంచ్‌ వేసింది. ‘పిల్లలున్నోడిని మళ్లీ పెళ్లి చేసుకుంటావా’ అంటూ కౌంటర్‌ వేసింది. ‘వాడి దగ్గర బాగా పైసలున్నాయి’ అని హారిక చెబితే… ‘పైసలు లేనోడు దొరకడా…’ మరో కౌంటర్‌ పడింది. ‘ఆమె లేకపోతే చచ్చిపోతా’ అని నోయల్‌ అంటే… ‘చావు పో’ అంటూ తెగేసింది గంగవ్వ.

* జిమ్‌ బాడీ.. జిమ్‌ బాడీ అంటున్నారు కానీ.. ఎప్పుడూ మెహబూబ్‌ జిమ్‌ బాడీ చూడలేదు. ఈ రోజు మెహబూబ్‌ జిమ్‌ బాడీ చూపించాడు. కండలు తిరిగిన శరీరాన్ని ఇష్టంగా ప్రదర్శించాడు.

* మార్నింగ్‌ మస్తీ గురించి హారిక తర్వాత ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంది. అద్భుతంగా చేశావని అఖిల్‌ చెబితే, మైండ్‌ బ్లోయింగ్‌ అని అభిజీత్‌ పొగిడేశాడు. నిజంగా బాగానే చేసింది కదూ..

* అమ్మ రాజశేఖర్‌ను ఏడిపించడానికి మెహబూబ్‌ – దివి కలసి ప్లాన్‌ చేశారు. రాజశేఖర్‌ చూసేలా దివిని మెహబూబ్‌ ఎత్తుకొని ఇంట్లో ఆ చివరి నుండి ఈ చివరికి తీసుకొచ్చాడు. ‘నా ఫిగర్‌ని వాడు తీసుకెళ్తున్నాడు’ అంటూ రాజశేఖర్‌ మాస్టర్‌ బాధపడ్డారు (నవ్వుతూ). ఆ తర్వాత ‘ఒక్క అమ్మాయినైనా వదలరా’ అంటూ రాజశేఖర్‌ పంచ్‌ వేశాడు. అందరినీ ఎత్తుకోవడం కాదు.. ‘దమ్ముంటే కళ్యాణిని ఎత్తుకోరా’ అంటూ మెహబూబ్‌కు సవాలు విసిరాడు రాజశేఖర్‌ మాస్టర్‌. దానికి కూడా మెహబూబ్‌ రెడీ అయి.. ఎత్తుకున్నాడు.

* అఖిల్‌ – మోనాల్‌ – అభిజీత్‌ మధ్య ట్రయాంగిల్‌ స్టోరీ ఇంకా రన్‌ అవుతోంది. లంచ్‌ సమయంలో మోనాల్‌కు అఖిల్‌ గోరుముద్దలు తినిపించాడు. దానిని అభిజీత్‌ నిశితంగా గమనిస్తున్నాడు. కాసేపటి తర్వాత మోనాల్‌ వచ్చి అభిజీత్‌ పక్కన కూర్చుంది. అప్పుడు మోనాల్‌ వైపు అఖిల్‌ తీక్షణంగా చూశాడు.

* ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌గా ‘బీబీ టీవీ’ ని ఇచ్చాడు. ఎంతగా ఎంటర్‌టైన్మెంట్‌ ఇస్తే అంత మంచిది అని కూడా సూచించాడు. దాని కోసం ‘అత్త అల్లుడు అమెరికా మోజు’ అనే సీరియల్‌ పేరు కూడా ఇచ్చాడు. ఇందులో కోడల్ని వేదిస్తూ… కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకునే గయ్యాళి అత్తగా కనిపిస్తుంది. ఆమె కొడుకుగా అభిజీత్‌, అతని భార్యగా సుజాత. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొట్టుకునే కళ్యాణి కూతురుగా దివి కనిపిస్తుంది. అయితే అమెరికా పెళ్లి కొడుకు అయిన అఖిల్‌కు ఇచ్చి దివిని పెళ్లి చేయాలని కళ్యాణి చూస్తుంటుంది. కళ్యాణి ఇంట్లో మతిమరుపు ఉన్న అకౌంటెంట్‌. అక్కడి మాటలు ఇక్కడ … ఇక్కడి మాటలు అక్కడ చెప్పే కళ్యాణి ఇంట్లో పనిమిషిగా దేవి. మిగిలిన సభ్యులు ఆడియన్స్‌గా మారడంతోపాటు మధ్య మధ్యలో రెండు టీమ్స్‌గా విడిపోయి యాడ్స్‌ చేయాలి.

* గయ్యాళి అత్తగా కళ్యాణి అదరగొట్టేసింది. తల్లికి భయపడే కొడుకుగా అభిజిత్ సూపర్‌గా చేశాడు. దివి ఫర్వాలేనిపించగా, దేవీ నాగవల్లి తన ఎటైర్‌, నటనతో బెస్ట్‌ అనిపించుకుంది.

* చీపురు యాడ్‌ను గంగవ్వ, నోయల్‌, హారిక, సోహైల్‌, అరియానా చింపి ఆరేశారు. ఆఖరులో గంగవ్వ పంచ్‌లు అయితే కేకో కేక. ఆఖరులో చిన్ని చీపురు అంటూ ఓ పాట కూడా పాడేశారు.

* మతిమరపు కుమార్‌ సాయి, పనిమనిషి దేవీ నాగవల్లి మధ్య ట్రాక్‌ను బాగా సిద్ధం చేసుకున్నారు. ‘నువ్వు నేను డింగ్‌ డింగ్‌’ సినిమాకి వెళ్దాం అంటూ దేవి- కుమార్‌ సాయి మంచి ట్రాక్‌ రన్‌ చేశారు. కుమార్‌ సాయిని మోసం చేసి… దేవి 25 వేల రూపాయలు కొట్టేయడం ఏదైతే ఉందో… వావ్‌ అసలు.

* అమెరికా నుండి వచ్చిన అఖిల్‌.. పని మనిషి దేవిని చూసి పెళ్లి కూతురు అనుకునే ట్రాక్‌ సూపర్‌ వచ్చింది. సందెట్లో సడేమియాలాగా దేవిని కుమార్‌ సాయి వాటేసుకునే సన్నివేశం చక్కగా వచ్చింది.

* అమ్మ రాజశేఖర్‌, మెహబూబ్‌, లాస్య, మోనాల్‌ కలసి బట్టతల యాడ్‌ చేశారు. జుట్టు లేని అమ్మ రాజశేఖర్‌ విగ్గు పెట్టుకొని మోనాల్‌ను పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. అమ్మాయికి నచ్చాడు అనుకునేలోగా విగ్గు తీసేసి దొరికిపోతాడు. ఆ తర్వాత జట్టు లేదని బాధపడొద్దు. ‘సలోఫా’ విగ్గు ఉంది కదా అంటూ ఓ యాడ్‌ చేశారు.

* అఖిల్‌ – దివి ప్రైవేటుగా మాట్లాడుకునే సీన్‌ చక్కగా లైన్‌ చేశారు. ఇక్కడ ‘పులిహోర’ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ‘నీకు పులిహోర కలపడం రాదా’ అంటూ అఖిల్‌కు దివి పంచ్‌ వేసింది. ఇంతలో దేవీ వచ్చి అఖిల్‌ అమ్మాయిల పిచ్చోడు అని చాడీలు పెట్టేసి వెళ్లిపోయింది. పల్లెటూరు అంటే నచ్చదు అన్నాడని అఖిల్‌ను పెళ్లి చేసుకోనని దివి చెబుతుంది. అదే సమయంలో దివిని పెళ్లి చేసుకోవడానికి అఖిల్‌ కూడా ఇష్టపడడు. అయితే అభిజీత్‌, సుజాత చెప్పిన మాటలు విని ఇద్దరూ పెళ్లికి అంగీకరిస్తారు. మీ కోడలు చాలా మంచిది అని… కళ్యాణికి అఖిల్‌ చెబుతాడు. ఈ క్రమంలో కళ్యాణికి కనువిప్పు కలుగుతుంది. పనిలోపనిగా మతిమరుపు అకౌంటెంట్‌కి, పని మనిషి దేవీకి పనిలో పనిగా పెళ్లి చేసేసింది కళ్యాణి.

* సీరియల్‌ అయిపోయాక.. హౌస్‌ మేట్స్‌ అందరూ…అమ్మ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో అందరూ సిగ్నేచర్‌ స్టెప్పులు వేశారు. ‘సలోఫా,’ ‘చిన్ని చీపిరి’ అంటూ ట్రేడ్‌ మార్క్‌ స్టెప్పులేశారు. ఫైనల్‌గా అందరూ కలసి అత్త-కోడలు మెసేజ్‌ ఇచ్చినా బోర్‌ కొట్టించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus