బిగ్‌బాస్‌ 4: ఎంటర్‌టైన్మెంట్‌ టన్నులు టన్నుల్లో…!

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చినవారు అయితే ఎంటర్‌టైన్‌ చేయాలి… లేదంటే బయటకు వెళ్లిపోవాలి. ఎంటర్‌టైన్‌ చేసిన వారిని 100వ రోజు తర్వాత బయటకు తీసుకొస్తారు. అలా ఈసారి 100వ రోజు వరకు ఉండే కంటెస్టెంట్లలో హారిక ఒకరు అని అభిమానులు అనుకుంటున్నారు. దానికి కారణం ఆమె హౌస్‌లో అందస్తున్న వినోదం. అవకాశం వచ్చినప్పుడల్లా తనను తాను నిరూపించుకుంటోంది. తాజాగా నిన్న జరిగిన మార్నింగ్‌ మస్తీలోనూ డ్యాన్స్‌, యాక్టింగ్‌తో అదరగొట్టింది.

తొమ్మిదో రోజు మార్నింగ్‌ మస్తీలో భాగంగా అందరినీ అలరించాలని హారికకు బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చారు. ట్రెండీ లుక్‌ వచ్చేలా డ్రెస్‌ వేసుకుని హారిక ఎంటర్‌టైన్‌ చేసింది. తొలుత కళ్యాణి పాట పాడితే హారిక డ్యాన్స్‌ వేసింది. ‘ఇప్పటికింకా నా వయసు ఇంకా పదహారే…’ అనే హౌస్‌మేట్స్‌ పాడగా… దానికి తగ్గట్టుగా హారిక హాట్‌ హాట్‌ స్టెప్పులేసింది. అందరూ చప్పట్ల మోతతో అభినందించారు. ఆ తర్వాత హారిక గురించి, ఆమె వెబ్‌ షోల గురించి కలుపుతూ నోయల్‌ ఓ ర్యాప్‌ పాడాడు. దానికి తగ్గట్టుగా హారిక బీట్‌ స్టెప్స్‌ అదరగొట్టింది. కపుల్‌ డ్యాన్స్‌ చేద్దామంటూ అఖిల్‌ను హారిక పిలిచింది. వారి కోసం ‘అదిరేటి డ్రెస్సు మీరేస్తే..’ అంటూ హౌస్‌ మేట్స్‌ పాట అందుకున్నారు. దానికి ఇద్దరూ వావ్‌ మూమెంట్స్‌ వేశారు.

డ్యాన్స్‌ అయిపోయాక యాక్టింగ్‌లో తనను తాను ప్రూవ్‌ చేసుకోవడానికి నోయల్‌తో కలసి హారిక ఓ స్కిట్‌ వేసింది. హారిక – నోయల్‌ ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి వాళ్ల బామ్మ అయిన గంగవ్వ దగ్గరకు వస్తారు. ఆ పెళ్లికి గంగవ్వ అంగీకరించదు. ఈ క్రమంలో గంగవ్వను ఒప్పిండచానికి హారిక చేసిన పర్‌ఫార్మెన్స్‌ సింప్లీ సూపర్బ్‌. ఆమెకు నోయల్‌, గంగవ్వ బాగా సపోర్టు చేశారు. ‘పిల్లలున్నోడిని మళ్లీ పెళ్లి చేసుకుంటావా’, ‘పైసలు లేనోడు దొరకడా…’ అంటూ గంగవ్వ వేసిన పంచ్‌లు అదిరిపోయాయి. ‘ఆమె లేకపోతే చచ్చిపోతా’ అని నోయల్‌ అంటే… ‘చావు పో’ అంటూ లాస్ట్‌ పంచ్‌ వేసింది గంగవ్వ. మార్నింగ్‌ మస్తీ గురించి హారిక తర్వాత ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంది. అద్భుతంగా చేశావని అఖిల్‌ చెబితే, మైండ్‌ బ్లోయింగ్‌ అని అభిజీత్‌ పొగిడేశాడు. నిజంగా బాగానే చేసింది కదూ..

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus