Bigg Boss 5 Telugu: నామినేషన్స్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..?

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం ఓపెన్ నామినేషన్స్ పెట్టాడు బిగ్ బాస్. లాస్ట్ టైమ్ టాస్క్ లాగా డిజైన్ చేసినపుడు ఐదుగురు నామినేట్ అయ్యారు. ఇప్పుడు హౌస్ మొత్తం నామినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ప్రోమోలో చూసినట్లయితే, తలపై సీసాలో ఉన్న లిక్విడ్ ని పోస్తూ హౌస్ మేట్స్ నామినేషన్ చేయాలి. ఇద్దర్ని సెలక్ట్ చేస్కుని తగిన కారణాలు చెప్పి ఈ లిక్వడ్ ని వారి తలపై పోయాల్సి ఉంటుంది. ఇక్కడే నామినేషన్స్ లో అనీమాస్టర్ కి ,కాజల్ కి పెద్ద గొడవ జరిగినట్లుగా సమాచారం తెలుస్తోంది.

అంతేకాదు, కేవలం ఒకే ఒక్క ఓటుతో శ్రీరామ్ చంద్ర సైతం నామినేట్ అయినట్లుగా చెప్తున్నారు. ఇక అనీమాస్టర్ లాస్ట్ వీక్ కెప్టెన్ కాబట్టి నామినేషన్స్ నుంచీ తప్పించుకుంది. అంతకుముందు కూడా అనీమాస్టర్ చేతిలో వపర్ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పవర్ కూడా లేదు. సో ఎవరైనా ఓటు వేస్తే నామినేట్ అవ్వక తప్పదు. అందుకే, ఈసారి అనీమాస్టర్ కి సైతం రెండు ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది. ఇక కాజల్ కూడా తనని ఇమిటేట్ చేసిన ఇష్యూనే మరోసారి నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చిందట.

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం రవి కెప్టెన్ అయ్యాడు కాబట్టి, రవిని ఎవ్వరూ నామినేట్ చేయలేదు. మిగిలిన 8మంది ఇంటి సభ్యులు ఈసారి నామినేషన్స్ లోకి వచ్చేశారు. నిజానికి కెప్టెన్ రవి కాబట్టి వారిలో ఒకర్ని రక్షించే అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు శ్రీరామ్, షణ్ముక్, సన్నీ, మానస్, సిరి, ప్రియాంక, కాజల్, అనీమాస్టర్ లు నామినేషన్స్ లోకి రావడంతో ఓటింగ్ ఇంట్రస్టింగ్ గా మారబోతోంది. ఈవారం డిసైడ్ చేసేలా ఓటింగ్ జరుగుతుందని దీన్ని బట్టీ మిగతావారాల ఎలిమినేషన్ కూడా చెప్పేయచ్చు అని అంటున్నారు. మరోవైపు రవి ఫ్యాన్స్ ఎలాగైనా సరే అనీమాస్టర్ కి ఓటు వేసేలాగానే కనిపిస్తున్నారు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus