Revanth: వాళ్ల సపోర్ట్ లేకపోతే రోడ్డున పడేదాన్ని… ఎమోషనల్ అయినా రేవంత్ తల్లి!

బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం మరొక రెండు రోజులలో ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో ఎవరు విన్నర్ అవుతారనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే ప్రస్తుతమున పరిస్థితులను బట్టి చూస్తుంటే బిగ్ బాస్ విన్నర్ గా రేవంత్ నిలబడతారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం మరొక రెండు రోజులలో ముగియనున్న నేపథ్యంలో రేవంత్ తల్లి సీతా సుబ్బలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రేవంత్ గురించి అతని తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా రేవంత్ తల్లి మాట్లాడుతూ… తన భర్త పేరు శంకర అని తెలిపారు. తనకు ఇద్దరు పిల్లలని అయితే రేవంత్ తన కడుపులో ఉండగానే తన తండ్రి చనిపోయారని ఈమె తెలిపారు. తనకు తన భర్త దూరమైన బంగారం లాంటి పిల్లలను ఇచ్చారని ఈమె ఆనందం వ్యక్తం చేశారు. ఇక రేవంత్ ని చూస్తే ఇప్పటికి తనకు చాలా బాధగా ఉంటుందని తాను తన తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయాడని బాధ నన్ను ఎప్పటికీ కలిసి వేస్తుందని ఈమె తెలిపారు.

తన తండ్రి లేరని చెబితే తన మనసు ఎక్కడ బాధపడుతుందోనని తన తండ్రి బతికే ఉన్నారని దుబాయ్ లో ఉన్నారనీ అబద్ధం చెప్పేదాన్ని. నిదానంగా ఇక్కడికి వస్తారని చెప్పేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి తన భర్త గురించి తన కొడుకు గురించి తెలిపారు. ఇక రేవంత్ తండ్రి చనిపోవడంతో తన తల్లి తండ్రులు అన్నయ్య వదినలు తమని హక్కును చేర్చుకొని కంటికి రెప్పలా కాపాడుకున్నారని, వాళ్ల సపోర్ట్ లేకపోతే మేము రోడ్డున పడే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.

ఇక రేవంత్ చిన్నప్పటినుంచి ఇంతే ప్రతి చిన్న విషయానికి కోప్పడడం తిరిగి వచ్చి క్షమాపణలు చెప్పడం తనకి అలవాటు ఉందని సుబ్బలక్ష్మి రేవంత్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus