Bigg Boss 8 Telugu: హాట్ టాపిక్ అయిన ‘బిగ్ బాస్ 8’ …లేటెస్ట్ ప్రోమో.!

బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. మరి రెండో వారం ఎలిమినేట్ అవుతారు? అనే ప్రశ్న పై ఆసక్తి రేకెత్తిస్తూ లేటెస్ట్ ప్రోమోని కట్ చేశారు బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu) టీం. రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా డిఫరెంట్ గా సెట్ చేశాడు బిగ్ బాస్. ఇప్పుడున్న హౌస్ మేట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వాళ్ళ పై రంగులు వేయాలి. నామినేట్ చేసే ముందు కారణాలు చెప్పాలి. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దరిని నామినేట్ చేయవచ్చు. అంటే ఇద్దరిద్దరిపై రంగులు పోయాలన్న మాట.

Bigg Boss 8 Telugu

ఈ క్రమంలో అభయ్ నవీన్.. ఆదిత్య ఓం, విష్ణు ప్రియలను నామినేట్ చేసి రంగులు పోశాడు. సోనియా.. నైనిక, విష్ణు ప్రియలను నామినేట్ చేసి రంగులు పోసింది. ఇక కిర్రాక్ సీత.. ‘మీరు బయట ఫ్రెండ్ షిప్ పెట్టుకుని వచ్చి.. దాన్ని మీరు ఫాలో అవ్వొచ్చు కానీ.. వేరే వాళ్లని ఫాలో అవ్వమనే రైట్ మీకు లేదు’ అంటూ ఓ పాయింట్ ని లేవనెత్తి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రేరణ, యష్మీ, నిఖిల్, పృథ్వీ వంటి సీరియల్స్ బ్యాచ్ తో విష్ణు ప్రియ గ్రూప్ కట్టి గేమ్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా ప్రేరణ, యష్మీ, నిఖిల్, పృథ్వీ.. వీళ్లంతా ముందు నుండే ఫ్రెండ్స్. అందుకే గ్రూప్ గా గేమ్ ఆడుతున్నట్టు సీత ఆరోపిస్తూ నామినేషన్స్ లో పాల్గొంది. అయితే సీత చెప్పిన పాయింట్ ని ప్రేరణ వ్యతిరేకించింది. తర్వాత ‘చెత్త గొడవ’ గురించి మాట్లాడి ప్రేరణని నామినేట్ చేసింది సీత. అలా ఈ (Bigg Boss 8 Telugu) ప్రోమో హాట్ టాపిక్ అయ్యింది.

దేవర ఈవెంట్ గెస్ట్ విషయంలో కన్ఫ్యూజన్ కు కారణమిదే!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags