Bigg Boss 9 Telugu: ‘నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటే.. అతను వేరే అమ్మాయితో’.. అయేషా జీనత్ కామెంట్స్ వైరల్!

‘బిగ్ బాస్ 9’ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. గత వారం డబల్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు ఆయేషా జీనత్. ‘సావిత్రి గారి అబ్బాయి’ సీరియల్‌తో పాపులర్ అయిన ఈమె ఆ తర్వాత ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్‌‌’ వంటి షోలో కూడా సందడి చేసింది. వాస్తవానికి ఈమె తమిళ ఆర్టిస్ట్. కానీ తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Ayesha Zeenath

తమిళ బిగ్ బాస్ 6వ సీజన్లో ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఆట, మాట అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అదే టైంలో హోస్ట్ కమల్ హాసన్ మాటలకు ఎదురు సమాధానాలు చెప్పి సంచలనం సృష్టించింది. ‘నన్ను రాంగ్ గా ప్రోజెక్ట్ చేయొద్దు’ అంటూ ఈమె కమల్ కు ధీటుగా సమాధానం చెప్పింది.

అలాంటి ఆమె ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లో అడుగుపెట్టడంతో ఆమె మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది. ఇదే క్రమంలో తన ప్రియుడు, లవ్ బ్రేకప్ వంటి వ్యవహారాల పై కూడా ఓపెన్ అయ్యింది.ఈమె తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్నప్పుడు 65 రోజుల పాటు హౌస్ లో ఉంది. ఆ టైంలో ఈమె ప్రియుడు వేరే అమ్మాయితో రిలేషన్లో ఉంటూ వచ్చాడట.

ఈ విషయం చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున ఆమెకు ధైర్యం చెప్పి గ్రీన్ స్టోన్ ఇవ్వడం జరిగింది. ఇది నామినేషన్స్ టైంలో ఉపయోగపడుతుంది అని ఆమె తెలిపింది. అలాగే లవ్ సింబల్ కూడా ఇచ్చి.. ఇది నీకు హౌస్లో నచ్చిన వాళ్ళకి ఇవ్వొచ్చు అని చెప్పి అయేషాని హౌస్ లోకి పంపాడు నాగార్జున.

మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

 

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus