షో లో కన్నీళ్లు పెట్టుకుని అసలు నిజాలు తెలిపిన ‘బిగ్ బాస్’ బ్యూటీ..!

హిందీలో భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకున్న ‘బిగ్ బాస్’ షో సౌత్ లో ప్రారంభమయ్యి విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలు లేదా ఫెడవుట్ అయిపోయిన సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా హౌస్ లోకి ఎంటర్ అవడం మనం చూస్తూనే ఉన్నాం.కొన్నాళ్ల తర్వాత సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను,సామాన్యులను కూడా ఈ షోలో భాగం చేస్తున్నారు నిర్వాహకులు. ఎటువంటి గుర్తింపు లేని చాలా మంది కంటెస్టెంట్స్..

ఈ షోలో పాల్గొన్న తర్వాత బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుని సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకున్నారు.అలాగే సొంతంగా ఫ్లాట్ లు కొనుక్కునే స్థాయికి వెళ్తున్నారు.అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఓ నటికి కనీసం సరైన బట్టలు కూడా లేవట. ఈ షోలో పాల్గొనే ముందు ఏకంగా 8 ఏళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందట. వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్ బిగ్ బాస్ ఓటీటీ షో ద్వారా పాపులర్ అయిన ఉర్ఫీ జావెద్ ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

తాజాగా ఈమె ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కానన్ హోస్ట్ చేస్తున్న షోలో పాల్గొంది. ఇందులో భాగంగా..ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించింది ఉర్ఫీ జావెద్.ఆమె మాట్లాడుతూ.. ” నేను గత 8 సంవత్సరాలుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాను. పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయాను. బిగ్ బాస్ ఓటీటీ షోకి వచ్చే ముందు నా దగ్గర డబ్బులు లేవు.

కనీసం షోలో వేసుకునేందుకు కావాల్సిన దుస్తులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అలా అని ఈమె హౌస్ లో ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. హౌస్ లో ఇంకొన్ని రోజులు ఉండగలిగితే ఈమెకు మరింతగా డబ్బులు వచ్చి ఉండేవేమో. అయితే బిగ్ బాస్ తర్వాత ఈమె పలు టీవీ షోలలో పాల్గొని సంపాదించుకున్నట్టు తెలుస్తుంది. అలా అని అప్పులన్నీ తీరేంత అయితే కాదు..!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus