ఆ వ్యక్తి కామెంట్స్‌పై ఫైర్ అయిన నటి ఎవరంటే..?

సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య దూరం తగ్గిపోయింది.. వీలు చూసుకుని ఫ్యాన్స్, నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు స్టార్స్.. ఏదైనా హద్దుల్లో ఉంటే ముద్దుగానే ఉంటుంది కానీ.. అతి చేస్తేనే కష్టంగా అనిపిస్తోంది.. బ్యాడ్ కామెంట్స్‌తో మొదలెట్టి బెదిరింపుల వరకు వెళ్తున్నారు కొందరు ఆకతాయిలు.. ఇప్పుడు పాపులర్ బిగ్ బాస్ బ్యూటీ కమ్ యాక్ట్రెస్ ఏకంగా హత్యా బెదిరింపులు ఎదుర్కోవడం కలకలం రేపుతోంది..వివరాళ్లోకి వెళ్తే.. ఉర్ఫీ జావెద్.. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఈ పాతికేళ్ల బ్యూటీ హిందీలో పలు టీవీ సీరియల్స్, వెబ్ సిరీసుల్లో నటించింది.

బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్‌లోనూ పార్టిసిపెట్ చేసింది.. ముఖ్యంగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ అనే ఇమేజ్ తెచ్చుకుంది.. అందుకు కారణమేంటంటే.. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే పిక్స్ అలా ఉంటాయి మరి.. డిఫరెంట్ డ్రెస్సులతో మగజాతికి మంట పుట్టిస్తుంటుంది.. అదే ఆమె కొంప ముంచింది.. అందం అంటే ఆరాధించేలా ఉండాలి కానీ అతిగా ఉండకూడదు అంటూ ఓ నెటిజన్ ఉర్ఫీ మీద మండిపడ్డాడు.. చంపేస్తానంటూ బెదిరించాడు కూడా..

3.8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌లో ఒక్క వ్యక్తికి మాత్రం తన డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదట.. అంతే, బెదిరింపులకు పాల్పడ్డాడు.. అతగాడికి తన స్టైల్లో ఘాటుగా రిప్లై ఇచ్చిందామె.. ఇంకో హైలెట్ ఏంటంటే అతను తనకు గతంలో పరిచయం ఉన్న వ్యక్తేనట.. తనతో స్నేహం చేయనందుకే.. ఉర్ఫీపై కోపం పెంచుకున్నాడట.. పనిలో పనిగా సమాజంలో రేపిస్టుల గురించి కూడా కామెంట్స్ చేసింది.. వేధింపులు ఎదుర్కొంటున్న వారు, వాళ్లకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని.. బెదిరిస్తే తిరిగి బెదిరించాలి కానీ భయపడుతూ కూర్చోకూడదు..

పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పుకొచ్చింది ఉర్ఫీ. తనపై వచ్చిన బెదిరింపుల విషయంలో ఉర్ఫీ చేసిన వ్యాఖ్యలకు పలువురు నటీమణులు సపోర్టు చేస్తుంటే.. మరికొంత మంది నెటిజన్లు.. ఒకోసారి నీ పిక్స్ చూస్తే అసలు డ్రెస్ వేసుకున్నావా?, లేదా అని డౌట్ వస్తోంది.. అతను నీమీద అభిమానంతోనే అలా అని ఉంటాడు.. అర్థం చేసుకోవాల్సింది పోయి నిందలు వేస్తున్నావెందుకు?.. అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus