మా నాన్న మమ్మల్ని పట్టించుకునే వాడే కాదు.. అమ్మే మమ్మల్ని పెంచింది: బిగ్ బాస్ కంటెస్టెంట్

‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో వీకెండ్లో ఎలిమినేట్ అయినవాళ్లు కొన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడమనేది మనం చూస్తూనే వస్తున్నాం. ఈ వారం ‘బిగ్ బాస్14’ నుండీ ప్రముఖ గాయకుడు కుమార్‌ సాను కొడుకు జాన్‌ కుమార్‌ సాను ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ తరుణంలో అతను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అతని తండ్రి గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. అమ్మే ఒంటి చేత్తో మమ్మల్ని పోషించింది’ అంటూ చెప్పుకొచ్చాడు. కొడుకు వ్యాఖ్యల పై స్పందించిన కుమార్‌ సాను చాలా బాధపడుతున్నట్టు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

అతను మాట్లాడుతూ.. “జాన్‌ నా పై చేసిన కామెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి. నేను నా మొదటి భార్య, జాన్‌ తల్లి అయిన రీటా భట్టాచార్య నుండీ ఎప్పుడో విడాకులు తీసుకున్నాను. అందుకు భరణంగా ఆమె అడిగినవన్నీ ఇచ్చాడు. అందులో నా మొదటి సంపాదనతో కొనుగోలు చేసిన బంగ్లా కూడా ఉంది. నేను వాళ్ళకు ఏమీ చెయ్యలేదు అనడం సబబు కాదు. విడాకుల తీసుకునే టైంకి నా ముగ్గురు పిల్లలు చాలా చిన్న వాళ్ళు. దాంతో తల్లి దగ్గరే వారిని ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఒంటరిగా వారిని పెంచినందుకు రీటాజీని నేను కూడా అభినందిస్తున్నాను. విడాకులు తీసుకున్నా నేను పిల్లల్ని కలిసేవాడిని. అయితే నిబంధనల రీత్యా ఎక్కువ సమయం గడిపేవాడిని కాను. రీటాతో విడాకులు తీసుకున్నాక నేను మరో పెళ్లి చేసుకున్నాను. ఇండియా నుండీ వెళ్లిపోయాను. దానికి కారణం నాకు ముంబైలో ఎక్కువ పని దొరికకపోవడమే.

అయితే ఇండియాకి వచ్చిన ప్రతీసారి జెస్సీ, జీకో, జానూలను కలిసేవాడిని. వారితో కలిసి డిన్నర్‌కు కూడా వెళ్లేవాడిని. ఇక వాళ్ళు పెద్దయ్యాక కలవడం తగ్గిన మాట నిజమే.ఎందుకంటే వాళ్ళు కూడ వాళ్ళ లైఫ్ యాంబిషన్స్ తో బిజీ అవుతున్నారు కాబట్టి..! నేను ముంబైలో ఉన్నప్పుడు ‘నాకు ఈ అవసరం ఉంది’ అని వాళ్ళు చెప్తే ఎప్పుడూ నేను కాదనలేదు. అయితే ఎక్కువగా ఫోన్‌లో మాత్రమే మట్లాడుకునే వాళ్లం” అంటూ చెప్పుకొచ్చాడు కుమార్‌ సాను.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus