Pallavi Prashanth: బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అలా మోసపోయారా.. ఏం జరిగిందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 తెలుగు ప్రోగ్రామ్ లో 13వ కంటెస్టెంట్ గా పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయాన్ని నమ్ముకుని కష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డను అన్నా అంటూ సోషల్ మీడియాలో చేసే పోస్ట్ ల ద్వారా వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ షోకు వెళ్లడం తన కల అని చాలా సందర్భాల్లో చెప్పిన ప్రశాంత్ ఆ కలను నెరవేర్చుకున్నారు.

బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి వారానికి లక్ష రూపాయల చొప్పున పల్లవి ప్రశాంత్ కు పారితోషికం దక్కుతోందని సమాచారం అందుతోంది. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్7 విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఉండనుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) మాట్లాడుతూ ఉద్యోగం చేయాలంటే ఒకరి కింద బ్రతకాలని పేర్కొన్నారు. కానీ వ్యవసాయం చేయడం ద్వారా నేను, నా కుటుంబం బ్రతుకుతుందని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. వ్యవసాయం చేయడం వల్ల నలుగురి కడుపు నింపుతామనే సంతోషం మిగులుతుందని ఆయన కామెంట్లు చేశారు. ఫోక్ సాంగ్స్ ద్వారా నేను సంపాదించిన డబ్బును నా ఫ్రెండ్స్ తీసుకుని మోసం చేశారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.

ఆ సమయంలో నేను చచ్చిపోతానంటే మా నాన్న కూడ చనిపోతానని చెప్పాడని పల్లవి ప్రశాంత్ వెల్లడించారు. బిగ్ బాస్ షో కోసం ఒక అడుగు ముందుకు వేశానని రైతు బిడ్డగా గర్వపడుతున్నానని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు. పల్లవి ప్రశాంత్ వెల్లడించిన విషాయలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus