సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కన్నుమూత..!

గత రెండు నెలలుగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మృత్యువాత పడటం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరొకరు మృతి చెందుతున్నారు. సోమవారం నాడు ప్రముఖ సింగర్ మెలోడీ క్వీన్‌ అయిన నయ్యారా నూర్‌ మృతి చెందగా…. ఆ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే మరో నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే.. హరియాణాకు చెందిన టిక్టాక్ స్టార్, బిగ్బాస్ కంటెస్టెంట్, బీజేపీ నాయకురాలు అయిన సోనాలీ ఫోగాట్ … సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె పార్టీ నాయకులు వెల్లడించారు. సోనాలి ఫోగట్‌ గోవాలో తుది శ్వాస విడిచినట్టు వారు తెలిపారు. సోనాలి మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే బీజేపీ నాయకులతో పాటు అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. ఆమె మరణానికి చింతిస్తూ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్ అయ్యి లక్షకు పైగా ఫాలోవర్స్‌ ను సంపాదించుకున్న ఆమె బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాలు రిలీజ్ అయినట్టు కూడా దాఖలాలు లేవు. తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా రాజకీయాల్లో చేరి.. బీజేపీ తరఫున పోటీ చేసింది. కానీ ఓడిపోయింది. సోనాలి వయసు కేవలం 42 సంవత్సరాలు మాత్రమే కావడం విషాదకరం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus