Bigg Boss: ఇలాంటి షోలు చూసి టైం వేస్ట్ చేసుకోకండి… సరయు షాకింగ్ కామెంట్స్!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు భాషలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటికి ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. అలాగే ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి సరయు ఒకరు. పలు బోల్డ్ కామెంట్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి సరయు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. అయితే ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చిన మొదటి వారమే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాగే ఓటిటిలో ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె నాలుగు వారాలపాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యారు.త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారం కాబోతున్న సమయంలో సరయు బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… ఈ రియాలిటీ షో లన్ని కూడా ఫేక్.మనం కొనుక్కొని లేదా వారు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చి మన అనుకున్న వాళ్లను ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఫ్లాట్ ఫామే ఈ రియాలిటీ షోలు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని జనాలందరినీ కూడా పిచ్చోళ్ళని చేస్తున్నారు. దయచేసి ఇలాంటి రియాలిటీ షోలను చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను కూడా ఈ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను కనుక మీకు ఈ విషయాలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా సరయు బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus