‘బిగ్ బాస్ 8’ లో యాంకర్ విష్ణుప్రియ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ‘బిగ్ బాస్ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను హౌస్లోకి వెళ్ళను. ఎందుకంటే ప్రపంచం బయట చాలా అందంగా ఉన్నప్పుడు.. ఎందుకు ఒక్క ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్ కాదు. చిన్నప్పటి నుండి నేను ఎప్పుడూ బిగ్ బాస్ చూడలేదు. నన్ను ఎవరైనా బిగ్ బాస్ గురించి అడిగితే నేను ఎంకరేజ్ కూడా చేయను. రాసి పెట్టుకోండి.. నేను బిగ్ బాస్ కి వెళ్ళను.ఒకవేళ వెళ్తే బదులుగా మీరు నన్ను ఎంతైనా విమర్శించొచ్చు” అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో కొన్ని కామెంట్స్ చేసింది.
ఫలితంగా ట్రోలింగ్ ఫేస్ చేసింది. కానీ బిగ్ బాస్ హౌస్లో ఈమె బాగానే గేమ్ ఆడింది. చాలా మంది ఈమె గేమ్ ను, ఆర్గ్యుమెంట్స్ ను సపోర్ట్ చేశారు. కానీ బిగ్ బాస్ కి వెళ్లడం అనేది నా లైఫ్లో నేను చేసిన పెద్ద మిస్టేక్ అంటూ ఈమె తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ అందరికీ షాకిస్తున్నాయి. విష్ణుప్రియ మాట్లాడుతూ.. “నేను బిగ్ బాస్ కు వెళ్ళింది కేవలం డబ్బుల కోసమే..! ఆ డబ్బుతో కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు అని ఆశ పడ్డాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. నేను ఇప్పటికీ మా పాత ఇంట్లోనే ఉంటున్నాను. నేను అనుకున్నది జరగలేదు కాబట్టి.. నా కెరీర్లో నేను బిగ్ బాస్ హౌస్ కు వెళ్లడం అనేది రాంగ్ డెసిషన్ గా భావిస్తున్నాను.

ఆ షోకి వెళ్లి నేను కొత్తగా నేర్చుకున్నది ఏమీ లేదు. నిజజీవితంలో నేను చాలా నేర్చుకున్నాను. ఒకవేళ మళ్ళీ బిగ్ బాస్ నుండి కాల్ వచ్చినా నేను వెళ్లదలుచుకోలేదు. ఒకసారి వెళ్ళినందుకే నన్ను నేను చాలా తిట్టుకుంటాను. ఎందుకు వెళ్లానా? అని నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి అన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా నన్ను అభిమానించే వారు నాకు ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
