ఘనంగా ఆరియానా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..!

‘బిగ్‌బాస్‌4’ లో టాప్ కంటెస్టెంట్ అయిన అరియానా గ్లోరీ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి.ఈ వేడుకలో ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లు అయిన సోహెల్, కుమార్ సాయి, మెహబూబ్ దిల్ సే, లాస్య, మోనాల్ వంటి వారితో పాటు ముక్కు అవినాష్ కూడా హాజరయ్యి సందడి చేశారు. ముఖ్యంగా అవినాష్ తో అరియనాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ‘బిగ్ బాస్’ హౌస్లో వీరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీళ్లకు బోలెడంత మంది ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు.

దాంతో అరియనా బర్త్ డే సెలబ్రేషన్స్ లో కూడా వీళ్ళు మరోసారి హైలెట్ అయ్యారని చెప్పొచ్చు. ఇక ఈ వేడుకలో వీరి బిగ్ బాస్ ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుని ఎంజాయ్ చేశారు. ‘బిగ్ బాస్4’ హోస్ట్ అయిన కింగ్ నాగార్జున కూడా అరియనాకు ఫోన్ చేసి విషెస్ చెప్పారట. అది అరియనాకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పుకొచ్చింది. ఇక ‘బిగ్ బాస్4’ హౌస్లోకి ఎంట్రీ ఇస్తూనే.. ‘ఐ యాం బోల్డ్’ అంటూ చెప్పుకొచ్చిన అరియనా.. అందుకు తగినట్టే హౌస్ లో గేమ్ ఆడి ఎంటర్టైన్ చేసిందని చెప్పొచ్చు.

మొదట ఈమెను సోహెల్ తో పాటు ఓ ప్రైవేట్ రూమ్లో పెట్టారు. రెండు రోజుల తరువాత వీరిని హౌస్లోకి పంపారు.అటు తరువాత ప్రతీ టాస్క్ లోనూ అద్భుతంగా రాణించింది అరియనా. ఎవ్వరినీ హర్ట్ చెయ్యకుండా చాలా బాగా గేమ్ ఆడి బోలెడంత మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుందని చెప్పొచ్చు. ఇది పక్కన పెట్టేసి.. అరియనా బర్త్ డే పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus