Arjun Kalyan: బేబీ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్!

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అర్జున్ కళ్యాణ్ ఒకరు. ఈయన సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. బిగ్ బాస్ లో శ్రీ సత్యతో పులిహోర కలపడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈయన బీబీ జోడి కార్యక్రమంలో వాసంతి తో కలిసి సందడి చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అర్జున్ (Arjun Kalyan) మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు. ఈ సందర్భంగా అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైనటువంటి కల్ట్ క్లాసిక్ మూవీ అంటూ బేబీ సినిమా పేరు ప్రస్తావనకు రాకుండా ఈయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో అందరూ కూడా నాకు తెలిసిన వారే హీరోయిన్ నాకు మంచి ఫ్రెండ్ కావడంతో ఆమె సెకండ్ హీరోగా నా పేరును సజెస్ట్ చేశారు.

ఇక డైరెక్టర్ కూడా నా ఫ్రెండ్ కావడంతో ఈ సినిమాలో తనకు తప్పకుండా ఛాన్స్ వస్తుందని అనుకున్నాననీ తెలిపారు. ఇలా ఈ సినిమాలో ఛాన్స్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తనకు చివరికి నిరాశే మిగిలిందని తెలిపారు. ఈ సినిమా నాలుగు కోట్ల ప్రాజెక్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమాలో నటించాలి అంటే మంచి మార్కెట్ ఉన్నవాళ్ళు అయితే బాగుంటుందని చెప్పి తనని రిజెక్ట్ చేశారు అంటూ అర్జున్ కళ్యాణ్ తెలిపారు.

తనకు మార్కెట్ రావడం కోసమే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాను. అయితే సినిమా అవకాశాలు ఇవ్వకుండా మార్కెట్ రావాలి అంటే ఎలా వస్తుంది.. ఎవరైనా అవకాశాలు కల్పిస్తే కదా మనలో టాలెంట్ బయటపడి మనకంటూ మార్కెట్ ఏర్పడేది అంటూ అర్జున్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus