Maanas Marriage: ఘనంగా ‘బిగ్‌బాస్‌’ ఫేమ్ మానస్‌ వివాహం… ఫొటోలు వైరల్‌.!

  • November 23, 2023 / 10:33 AM IST

టాలీవుడ్ నటుడు, బుల్లి తెర స్టార్‌ నటుడు, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ మానస్‌ నాగుపల్లి ఓ ఇంటివాడయ్యాడు. మిత్రులు, బంధువుల సమక్షంలో తన బ్యాచిలర్‌ లైఫ్‌కు బైబై చెప్పాడు. బుధవారం (నవంబర్‌ 22) రాత్రి చెన్నైకు చెందిన శ్రీజ మెడలో మూడు ముళ్లు వేశాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మానస్‌ ఇంట్లో ఒక రోజు ముందు నుండే పెళ్లి సందడి మొదలయ్యింది.

హాల్దీ వేడుకల్లో భాగంగా మానస్‌ – శ్రీజ ఒకరి మీద ఒకరు పసుపు నీళ్లు గుమ్మరించుకున్నారు. వచ్చిన బంధువులు కూడా పసుపు రాయగా.. ఆతరువాత ఇద్దరూ స్టెప్పులేశారు. పెళ్లిలో మానస్ కుటుంబ సభ్యులతోపాటు, బుల్లితెర నటులు, బిగ్ బాస్‌లో షోలో మానస్‌తో పాటు పాల్గోన్న కంటెస్టెంట్లు సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన మానస్ ప్రి వెడ్డింగ్ వేడుకల ఫొటోలు, హల్దీ ఈవెంట్ ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు ప్రియ, కాజల్‌, శుభ శ్రీ రాయగురు, హమీదా, తేజ తదితరులు పాల్గొన్నారు. మానస్ – శ్రీజకు అభిమానులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మానస్‌ యాక్టింగ్‌ కెరీర్‌ గురించి చూస్తే… బాల నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత నటుడిగా మరికొన్ని సినిమాలు చేశాడు. అయితే సినిమాల్లో కంటే టీవీల్లోనే ఎక్కువ పాపులర్‌ అయ్యాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొని ఇంకా పాపులర్‌ అయ్యాడు.

బయటకు వచ్చాక అతను (Maanas) చేసిన ‘బ్రహ్మముడి’ సీరియల్‌ మంచి ఆదరణ పొందుతోంది. దీంతోపాటు విష్ణు ప్రియతో చేసిన కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా ఆదరణ పొందాయి. మరో వైపు ఓంకార్‌ తెరకెక్కించిన ‘మ్యాన్షన్‌ 24’ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చాడు. మానస్‌ నాగులపల్లి- శ్రీజల నిశ్చితార్థం ఈ ఏడాది సెప్టెంబర్‌లో బంధువుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus