కొత్త జంట ఫుల్ జోష్‌లో ఉన్నారే.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో, నాని హోస్ట్‌గా చేసిన రెండో సీజ‌న్‌లో కంటెస్టెంట్‌గా మెరిసిన న‌టుడు సామ్రాట్, తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించాడు. కొచెం ఇష్టం కొంచెం క‌ష్టం, పంచాక్ష‌రి, అహ నా పెళ్ళంట, ‌వైఫ్ ఆఫ్ రామ్‌లో పాటు ప‌లు చిత్రాల్లో న‌టించిన సామ్రాట్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో కంటే బిగ్‌బాస్‌లో తేజ‌స్వితో చేసిన రొమాన్స్ కార‌ణంగా సామ్రాట్ బాగా పాపుల‌ర్ అయ్యాడు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సామ్రాట్ ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నాడు.

శ్రీలిఖిత అనే అమ్మాయితో వివాహం చేసుకున్న సామ్రాట్ ప్ర‌స్తుతం భార్య‌తో వింట‌ర్ సీజ‌న్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌న భార్య‌తో గ‌డిపిన ఆనంద‌క్ష‌ణాల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. వాటిలో త‌న భార్య‌, త‌న‌ని బ‌హిరంగంగా ముద్దాడిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియ‌లో బాగా వైర‌ల్ అవుతోంది. మోడ‌ల్ అండ్ ఫ్యాష‌న్ డిజైనర్ అయిన శిల్పా రెడ్డి సొద‌రుడు అయిన సామ్రాట్ రెడ్డి మొద‌ట‌ హర్షితా రెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంత‌కాలం వారి కాపురం బాగానే సాగినా, ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్ధ‌లు కార‌ణంగా తీవ్ర గొడ‌వ‌ల‌కు దారి తీశాయి.

ఈ క్ర‌మంలో హ‌ర్షితా రెడ్డికి విడాకులు ఇచ్చిన సామ్రాట్ కెరీర్ పై దృష్టి పెట్టాడు. ఆ త‌ర్వాత శ్రీ లిఖిత‌ను పెళ్లి చేసుకున్న సామ్రాట్ ప్ర‌స్తుతం ఆమెతో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాడు. ఇక సామ్రాట్ – శ్రీలిఖిత‌ల పెళ్లి వివాహం నెల పూర్తికావడంతో ఆమెతో గడిపిన కొన్ని ఫొటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న భార్యపై ప్రేమను కురిపించాడు. ఈ క్ర‌మంలో స‌మ‌యం ఎంత ఫాస్ట్‌గా గడిచిపోతుందో తెలియ‌డంలేద‌ని, ఇలాగే ఇంకా మ‌రిన్ని సంవత్సరాలు నీతో క్షణాల్లా గడిచిపోవాలని కోరుకుంటున్నానంటూ.. తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఒక రొమాంటిక్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌తో పాటు శ్రీ లిఖిత త‌న‌ని రొమాంటిక్‌గా ముద్దుపెట్టుకున్న ఫొటోను కూడా షేర్ చేయ‌డంతో, అది చూసిని నెటిజ‌న్లు అంతే రొమాంటిక్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus