Siri, Shrihan: శ్రీహాన్ తో రిలేషన్.. సిరి ఏమందంటే..?

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది సిరి. అప్పటికే ఆమె శ్రీహాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. సీజన్ 5 బిగ్ బాస్ స్టేజ్ పై కూడా ఒకసారి శ్రీహాన్ కనిపించారు. ఇప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. రీసెంట్ గా శ్రీహాన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చింది సిరి. ఇదిలా ఉండగా.. అరియనాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీహాన్ తో రిలేషన్ గురించి మాట్లాడింది సిరి.

ఇంటర్వ్యూలో భాగంగా సోషల్ మీడియాలో సిరి గురించి వైరల్ అయిన పోస్ట్ లను అరియనా చూపించింది. సిరికి శ్రీహాన్ బ్రేకప్ చెప్పాడని.. తన లైఫ్ నుంచి సిరి జ్ఞాపకాలను తీసేశాడనే పోస్ట్ పై స్పందించాలని అరియానాను కోరారు. దానికి సిరి బిగ్ బాస్ సీజ్ 5 సమయంలో జరిగి ఉంటుందేమో అన్నారు. అయినా.. జ్ఞాపకాలను తీసేసి ఉంటే ఇప్పుడు కలిసి ఉండేవాళ్లమా..? అని సిరి ప్రశ్నించింది.

ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన తరువాత తమ వ్యక్తిగత జీవితాల్లో చాలా సమస్యలు వచ్చాయని సిరి తెలిపింది. చాలా అంటే చాలా వచ్చాయని.. వాటి గురించి ఎవరూ ఊహించలేరని అంది. దానికి అరియనా ఒకట్రెండు చెప్పమని అడిగింది. బ్రేకప్ వరకూ వెళ్లినట్లు చెప్పింది సిరి. ఆ సమయంలో శ్రీహాన్ ఒక్కడే ట్రిప్ కి వెళ్లాడని.. అతడికి కోవిడ్ కూడా వచ్చిందని సిరి చెప్పింది.

అప్పుడు తనకు కూడా ఏదొకటి చేసేసుకుందామనే ఆలోచన వచ్చిందని.. జనాలకు, ఇంట్లో వాళ్లకు ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోదామని అనుకున్నట్లు సిరి తెలిపింది. ఉదయాన్నే 6 గంటలకు లేచి మణికొండ రోడ్ల మీద చెప్పుల్లేకుండా తిరిగానని.. మళ్లీ శ్రీహాన్ వచ్చి ఇంటికి తీసుకెళ్లాడని గుర్తుచేసుకుంది. ఇప్పుడు తమ మధ్య బలమైన బంధం ఉందని పేర్కొంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus