Tasty Teja: ఆ వ్యాపారంలో టేస్టీ తేజ క్లిక్ కావడం ఖాయమేనా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా అభిమానులకు దగ్గరైన వాళ్లలో టేస్టీ తేజ (Tasty Teja) ఒకరు. అంతకు ముందే యూట్యూబ్ వీడియోల ద్వారా టేస్టీ తేజకు గుర్తింపు వచ్చినా బిగ్ బాస్ షో అతని రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలతో కలిసి టేస్టీ తేజ వీడియోలు చేయగా ఆ వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

అయితే టేస్టీ తేజ కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇరానీ నవాబ్స్ పేరుతో టేస్టీ తేజ హొటల్ పెడుతున్నానని వెల్లడించగా ఆ విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన కొత్త బిజినెస్ గురించి టేస్టీ తేజ మాట్లాడుతూ నేను కొత్తగా ఒక ప్రయాణం మొదలుపెడుతున్నానని ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు మనందరం కలిసి ఎదుగుదామని పేర్కొన్నారు.

సాధిద్దాం సంపాదిద్దాం అంటూ టేస్టీ తేజ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. ఈ నెల 6వ తేదీన ఉప్పల్ లో ఈ బిజినెస్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ అమర్ దీప్ ఈ ఔట్ లెట్ ఓపెనింగ్ కు గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ బిజినెస్ లో టేస్టీ తేజ సత్తా చాటుతారో లేదో చూడాలి. టేస్టీ తేజ అసలు పేరు తేజ్ దీప్.

సోషల్ మీడియాలో సైతం టేస్టీ తేజ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. టేస్టీ తేజ సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఫుడ్ బిజినెస్ లో ఎంట్రీ ఇస్తున్న తేజ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. టేస్టీ తేజ త్వరలో మరిన్ని శుభవార్తలు చెప్పాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus