Bigg Boss 7 Telugu: ప్రశాంత్ ని నిలదీసిన రతిక..! బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి.. ? లైవ్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో టాప్ – 5 ర్యాంకింగ్ టాస్క్ స్టార్ట్ అయ్యింది. హౌస్ లో ప్రస్తుతం 10మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిని ఏ నెంబర్ కి అర్హులో ఆ బోర్డ్ దగ్గర నుంచుని వారి ర్యాంక్ ని చెప్పమని అన్నాడు బిగ్ బాస్. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. టాప్ – 5లో ఖచ్చితంగా ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్ ని పెట్టాలని క్లియర్ గా చెప్పాడు. దీంతో ఆర్గ్యూమెంట్స్ స్టార్ట్ అయ్యాయ్. ఇంటి కెప్టెన్ గా శివాజీ ఆ బాధ్యతని భుజాన వేసుకున్నాడు. దీంతో ఆట ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరు తమ పాయింట్స్ చెప్పారు.

ఇక్కడే రతిక ప్రశాంత్ కి ఫుల్ గా క్లాస్ పీకేసింది. తన మనసులో మాటలన్నీ బయట పెట్టేసింది. ఫస్ట్ వీక్స్ లో ఉన్న ప్రశాంత్ ఏమీ రాదని కనీసం గేమ్ లో పార్టిసిపేషన్ చేయకపోతే వెళ్లి ఏడ్చావని గుర్తు చేసింది. ఆ తర్వాత పవర్ అస్త్రా పట్టుకునే టాస్క్ లో నేను నోరుజారడం, నిన్ను తిట్టడం అనేది నాకు మైనస్ అయ్యింది. ఆడియన్స్ లో నీకు అది ప్లస్ అయ్యిందని చెప్పేసింది. ఆతర్వాత జడ్జి నామినేషన్స్ అప్పుడు కూడా నీతో నేను పోట్లాడటం వల్ల నువ్వు ఆడియన్స్ లో చాలా పాజిటివ్ అయ్యావే తప్ప, గేమ్ పరంగా మాత్రం మూడు వారాలు ఏమీ ఆడలేదని నిలదీసింది.

నీవల్లే నేను బ్యాడ్ అయిపోయాను, బయట కూడా బాగా నెగిటివిటీ వచ్చిందని మొత్తుకుంది. నేను చేసింది తప్పే, అందుకే రీ ఎంట్రీలో మళ్లీ ఛాన్స్ కోసం వచ్చాను. అప్పట్నుంచీ గేమ్ మంచిగా ఆడుతున్నానని, గత రెండు వారాలుగా నీ పెర్ఫామన్స్ ఏమీ లేదు కాబట్టి పల్లవి ప్రశాంత్ ని నేను 3వ నెంబర్ ర్యాంక్ ఇస్తున్నానని చెప్పింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ ర్యాంకింగ్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్ గా ఎవరెవరు ఏయే ర్యాంకుల్లో ఉన్నారంటే., నెంబర్ 1 ర్యాంక్ లో హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ శివాజీకి వేశారు.

నెంబర్ – 2 యావర్, నెంబర్ -3 పల్లవి ప్రశాంత్ , నెంబర్ – 4 ప్రియాంక జైన్ , నెంబర్ – 5 శోభాశెట్టిని పెట్టారు. ఇక్కడ ఫిమేల్ కంటెస్టెంట్స్ లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది కాబట్టి అశ్వినిని టాప్ 5లో పెట్టలేదు. అలాగే, రతిక కూడా రీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి టాప్ 5లో లేదు. దీంతో రతిక చాలాసేపు గోల చేసింది. నేను టాప్ 5లో అడగలేదు కానీ, మరీ నన్ను టాప్ 10 పెట్టడం అనేది కరెక్ట్ గాదని నేను అంత వీక్ కంటెస్టెంట్ కాదని చాలాసేపు వాదించింది.

ఇక 6వ ర్యాంక్ లో అమర్ దీప్, 7లో గౌతమ్, 8లో అర్జున్ , 9లో అశ్విని , 10లో రతిక ఉన్నారు. ఫైనల్ గా వారి ర్యాంక్స్ ని డిసైడ్ చేస్తూ బిగ్ బాస్ కి చెప్పారు. ఇక్కడే బిగ్ బాస్ అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. బోటమ్ ర్యాంక్ లలో ఉన్న ఐదుగురు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఆడేందుకు కంటెండర్స్ అయ్యారని చెప్పాడు. టాప్ 5లో అనుకున్నవాళ్లకి ఇమ్యూనిటీ అక్కర్లేదు కాబట్టి బోటమ్ లో ఉన్న ఐదుగురు మాత్రం పోటీ పడాలని చెప్పాడు.

దీనికోసం స్మిమ్మింగ్ పూల్ లో కీస్ ఉన్నాయని బాక్స్ ఓపెన్ చేయాలని చెప్పాడు. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని అర్జున్ గెలుచుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, ఈ టాస్క్ ఏంటి., ఎవరెవరు ఎలా ఆడారు అనేది మాత్రం ఇంకా టెలికాస్ట్ కావాల్సి ఉంది. లైవ్ లో అయితే ర్యాంకింగ్స్ కి సంబంధించిన గేమ్ పూర్తి అయ్యింది. ఎవిక్షన్ ప్రీ పాస్ అనేది వాళ్లకి అయినా వాడచ్చు ఎవరికైనా కూడా వాడచ్చు. ఇది అందరికీ తెలిసిందే. ఇక టాప్ 5 ఎవరు అనేది (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ సీజన్ 7లో ఆసక్తిని కలిగిస్తోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus