Himaja: నూతన గృహ ప్రవేశం చేసిన హిమజ!

హిమజ పరిచయం అవసరం లేని పేరు. పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ క్రేజ్ తో ఏకంగా బిగ్ బాస్ అవకాశం అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె సినిమా అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకొని ఈమె తన కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంది అంటూ కొత్త ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో కూడా చేశారు. అయితే తాజాగా తన ఇంటి నిర్మాణ పనులు పూర్తీ అయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె (Himaja) గృహప్రవేశం కూడా చేశారు.

ప్రస్తుతం ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఈ ఫోటోలలో ఈమె పట్టు పరికిణి ధరించి అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. చేతిలో లక్ష్మీదేవి ఫోటోని పట్టుకొని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇలా హిమజ గృహప్రవేశ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..కొత్త ఇంటిని నిర్మించుకోవడం అంటే మన కలను నెరవేర్చుకోవడం, జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం. నాకు నేనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను, అని కామెంట్ చేశారు.

ఈ విధంగా కామెంట్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు, మిత్రులు సోషల్ మీడియా వేదికగా హిమాజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈమె తన కొత్త ఇంటిని అన్ని సదుపాయాలతో ఎంతో విలాసవంతంగా నిర్మించారని తెలుస్తుంది. ఈ ఇంటిని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంతో అందంగా నిర్మించారని తెలుస్తుంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus