బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఈసారి ఏకంగా 11మంది నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో సీనియర్స్ ఏడుగురు ఉంటే, నలుగురు జూనియర్స్ ఉన్నారు. అయితే, ఈసారి మాత్రం డేంజర్ జోన్ లో ప్రధానంగా ముగ్గురు కనిపిస్తున్నారు. వీరిలో సీనియర్స్ లేకపోయినా కూడా సీనియర్స్ కి కూడా ముప్పు తప్పేలా కనిపించడం లేదు. నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలకి కూడా ఎలిమినేషన్ గండం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
అఖిల్, ఇంకా అరియానా ఇద్దరూ కూడా టాప్ ప్లేస్ లో సేఫ్ జోన్ లోనే కనిపిస్తున్నారు. అన్ని అన్ అఫీషియల్ పోలింగ్స్ లో కూడా వీరిద్దరూ సేఫ్ గానే ఉన్నారు. ఆ తర్వాత యాంకర్ శివ కూడా సేఫ్ గానే ఉన్నాడు. అషూరెడ్డి, హమీదాలు కూడా కొద్దిగా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక సరయు కూడా అన్ అఫీషియల్ పోలింగ్స్ సైట్స్ లో చూస్తే సురక్షితంగానే కనిపిస్తోంది. అయితే, మరి ఎక్కువ స్థాయిలో మాత్రం ఓటింగ్ జరగలేదనే చెప్పాలి. ఇక ఓటింగ్ లో నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టా లు వెనకబడిపోయారు.
సీనియర్స్ లో చూస్తే వీరిద్దరే డేంజర్ జోన్ లో కనిపిస్తున్నారు. జూనియర్స్ లో మాత్రం అనిల్ రాధోడ్, మిత్రా శర్మా, ఇంకా శ్రీరాపాక డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈసారి హౌస్ నుంచీ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి అయ్యింది. అతడా ఆమెనా అనేది కూడా చాలా ఉత్కంఠని రేకెత్తిస్తోంది. రెండోవారం నామినేషన్స్ లో సీనియర్స్ నుంచీ ఎవరైనా ఎలిమినేట్ అవుతారా లేదా జూనియర్స్ నుంచీ ఎవరైనా ఎలిమినేట్ అవుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకూ జరిగిన అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే గనక, అనిల్ , శ్రీరాపాక ఇంకా మిత్రాశర్మ లు లీస్ట్ లో ఉన్నారు. ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే వీరిలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంటి కెప్టెన్ గా బాధ్యతలు తీస్కున్న అనిల్ రాథోడ్ ఇప్పుడు ఎలిమినేట్ అయితే మాత్రం ఖచ్చితంగా హౌస్ మేట్స్ కి ఇది షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, గత కొన్నిరోజులుగా అనిల్ పెర్ఫామెన్స్ హౌస్ లో చాలా బాగుంది.
టైర్స్ టాస్క్ లో బాగా ఆడి ఛాలెంజర్స్ టీమ్ కి విజయాన్ని అందించాడు. అలాగే, టైల్స్ టాస్క్ బాగా ఆడి కెప్టెన్ కూడా అయ్యాడు. అంతేకాదు, స్మగ్లర్స్ టాస్క్ లో కూడా మహేష్ విట్టాతో సై అంటే సై అన్నాడు. మరి ఈవారం డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి సేఫ్ అయితే మాత్రం అనిల్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారతాడు నో డౌట్.