తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ఇటీవల తెలుగులో 7 వ సీజన్ పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్ మంచి ఆదరణ సంపాదించుకోవడంతో నిర్వాహకులు వెంటనే ఓటీటీ షో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి మొదటి వారంలో ప్రసారం చేయాలని భావించారు. ఇలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నటువంటి మేకర్స్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించారని తెలుస్తోంది.
ఏడవ సీజన్లో పాల్గొన్నటువంటి పలువురు కంటెస్టెంట్లతో పాటు కొత్తవారిని కూడా తీసుకోవాలని మేకర్స్ కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టారట. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో రద్దయిందని తెలుస్తోంది. ఇలా చివరిలో ఈ కార్యక్రమం ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే టీవీ సీజన్ అయితే మేము ఈ షోలో పాల్గొంటామని చాలామంది ఈ ఓటీటీ సీజన్లో పాల్గొనడానికి ఇష్టం చూపించలేదట.
అధికంగా రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ కంటెస్టెంట్లు పాల్గొనడానికి ఆసక్తి కనబరచడం లేదు. ఇలా కంటెస్టెంట్ లో ఆసక్తిగా లేకపోవడమే కాకుండా మరోవైపు నాగార్జున కూడా సినిమాల పరంగా బిజీగా ఉన్న తరుణంలో ఈయన కూడా అందుబాటులో ఉండరని తెలిసి ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేశారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. మరి ఈ కార్యక్రమం (Bigg Boss) గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.