బిగ్ బాస్ షో వీరికి బాగానే కలిసొచ్చిందే!

బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలైందంటే.. ప్రతీ ఇంట్లోనూ షో సమయానికి జనాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈ షో విషయంలో కొన్ని విమర్శలు, వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణ అంతకుమించి ఉంది. అప్పటివరకు ప్రేక్షకులకు పరిచయం కూడా లేని వాళ్లు ఈ షోలో పాల్గొన్న తరువాత సెలబ్రిటీలు అయిపోతుంటారు. ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చినా.. అవకాశాల ప్రకారం చూసుకుంటే గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఎవరికీ ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు. దీంతో బిగ్ బాస్ షోలో పాల్గొన్నా.. ప్రయోజనం లేదనే మాటలు వినిపించేవి. కానీ ఈసారి మాత్రం షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు.

గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ల కెరీర్లు ఊపందుకునేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్’ షో నుండి బయటకి వచ్చిన తరువాత సోహైల్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలానే మరో సినిమా చర్చల దశలో ఉందట. అలానే షో మధ్యలో నుండి వెళ్లిపోయిన దివి.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలానే ఆమె హీరోయిన్ గా రెండు సినిమాలు ప్రాసెస్ లో ఉన్నాయి. మెహబూబ్ కి కూడా సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ‘జబర్దస్త్’ షోతో మంచి పేరు తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ షో తరువాత నుండి సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు.

ఇప్పటికే ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ కామెడీ రోల్ ని దక్కించుకున్నాడు. మరోపక్క లాస్య చాలా కాలం తరువాత టీవీ షోలతో బిజీ కానుంది. సంక్రాంతి కానుకగా ప్రసారం చేయనున్న ఓ షోని యాంకర్ రవితో కలిసి హోస్ట్ చేసింది లాస్య. అలానే మరో రెండు షోలో ఆమె చేతిలో ఉన్నాయట. ఇక మోనాల్ అయితే ఓ పక్క టీవీ షోలు, మరోపక్క సినిమాలతో బిజీ అయిపోయింది. ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇక బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్ మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అరియానాకు కూడా టీవీ షోల్లో అవకాశాలు వస్తున్నాయి. రన్నరప్ గా నిలిచిన అఖిల్ కి రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చిందని సమాచారం. మొత్తానికి బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది కంటెస్టెంట్ లు తమ కెరీర్ ను ట్రాక్ లో పెట్టుకుంటున్నారు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus