Sohel: వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ల కన్నా మా వీడియోలకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి: సోహైల్

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో సోహెల్ కూడా ఒకరు. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా పాపులర్ అయిన సోహెల్ కి హీరోగా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో సోహెల్ హీరోగా నటించిన ” లక్కీ లక్ష్మణ్” అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 31 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇటీవల సినిమా యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న సోహెల్ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోహెల్ మాట్లాడుతూ… గతంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వీడియోలపై సోషల్‌ మీడియాలో ఇలాంటి కామెంట్లు చూసినప్పుడు చాలా బాధేసిందని వెల్లడించాడు.

బయట ఎలా ఉంటానో.. మీడియా ముందు కూడా నేను అలాగే ఉంటాను. కానీ ఇప్పటినుండి సినిమాలలో కాకుండా నిజ జీవితంలో కూడా నటించాలేమో అని చాలా చెప్పుకొచ్చాడు. ఇలా ఇలా స్టేజ్ పై, మీడియా ముందు నటించటం తనకి రాదని, అందువల్లే ఈ సమస్యలు వస్తున్నాయని తన బాధ బయటపెట్టాడు. ప్రస్తుత కాలంలో జనాలు కూడా పాజిటివ్‌ కంటె నెగటివ్‌ వార్తలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గతంలో మా ఫాదర్‌ పడ్డ కష్టంపై ఒక వీడియో తీసి పెడితే దానికి కేవలం ఐదు వందల వ్యూసే వచ్చాయని,

అదే స్టేజ్‌పై తాను చేసిన కామెంట్లకు సంబందించిన వీడియోలకు మాత్రం లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయని చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమా ప్రెస్‌మీట్‌ వీడియోలకంటే మా నెగటివ్‌ వీడియోకే ఎక్కువగా వ్యూస్‌ వచ్చాయని తెలిపారు సోహైల్‌. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను మాట్లాడిన మాటలకు సంబందించిన వీడియోలకు వస్తున్న కామెంట్లు చూసి చాలా బాధగా ఉందని ఎమోషనల్ అయ్యాడు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus