బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ అయ్యేటపుడు శివాజీకి హౌస్ మేట్ గా ఉండటానికి అనర్హుడు అని మెజారిటీ ఇంటి సభ్యులు ఓటు వేశారు. అయితే, ఈ విషయం శివాజీకి అప్పటికప్పుడే తెలిసింది. యాక్టివిటీ ఏరియాకి వెళ్లి వీళ్లు ఎలాంటి రీజన్స్ చెప్పారు అనేది మాత్రం తెలియలేదు. దీంతో శివాజీ నేను తప్పు చేయలేదని నేను హౌస్ మేట్ గా ఉండటానికి ఎందుకు అనర్హుడినో చెప్పండని నాగార్జునని నిలదీశాడు.
దీనికి నాగార్జున హౌస్ మేట్స్ మెజారిటీ ఓట్లు నువ్వు పార్షియాలిటీ చూపించి జడ్జిమెంట్ ఇచ్చావని చెప్పారని, అందుకే పవర్ అస్త్రా పోయిందని కానీ జనాలు చూస్తున్నారు కదా అంటూ సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, శివాజీ వినలేదు ఆర్గ్యూమెంట్ కి దిగాడు. దీంతో నాగార్జున మిగతా ఇంటిసభ్యులని సరైన రీజన్ చెప్పమని నిలదీశాడు. ముఖ్యంగా శోభా శెట్టిని ఒక ఆట అడుకున్నాడు కింగ్ నాగార్జున. శోభాశెట్టి ఆయన అసలు ప్యానల్ లో నేను ఉన్నప్పుడు మాట్లాడనివ్వలేదని, అమర్ విషయం తెస్తే అమ్మా, జనాలు చూస్తున్నారమ్మా అంటూ చాలాసార్లు మాట్లాడుతూ అడ్డం కొట్టారని చెప్పింది.
కానీ, ఇది సరైన రీజన్ కాదు, పార్షియాలిటీగా ఎక్కడ నిర్ణయం తీస్కున్నాడో చెప్పమని అడిగాడు నాగార్జున. ఇది చెప్పడం లో విఫలం అయ్యారు స్టార్ మా బ్యాచ్. చేయి ఎత్తి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూడా శివాజీకి రీజన్ చెప్పలేదు. దీంతో ప్రియాంక తను అస్తమానం హౌస్ మేట్ నుంచీ కంటెస్టెంట్ కి వెళ్లిపోతానని చెప్పేవాడని అది నాకు గుర్తుకు వచ్చి వేశానని చెప్పింది. కానీ, అమర్ కూడా ఇదే మాట చాలాసార్లు అన్నాడు కదా, అది తప్పుకానప్పుడు ఇది తప్పు ఎలా అవుతుందని నిలదీశారు నాగ్.
దీంతో హౌస్ మేట్స్ కి రీజన్స్ లేకుండా పోయాయి. ముఖ్యంగా శోభాశెట్టి రీజన్స్ చెప్తుంటే, ఒక చేయి వేరే వాళ్ల వైపు చూపించేటపుడు మనం ఏం చేశామని కూడా చూసుకోవాలంటూ క్లాస్ పీకారు. అలాగే, కాల్చిన గుడ్డ ఎవరి ముఖంపైన అయినా ఈజీగా పడేయచ్చని, కానీ మన వరకూ వస్తేనే అది తెలుస్తుందని ఫుల్ క్లాస్ పీకారు.
నిజానికి స్టార్ మా బ్యాచ్ లో ఏ ఒక్కరు సరైన రీజన్ చెప్పినా, శివాజీకి క్లాస్ పడేది. కానీ అవకాశం ఇచ్చినా కూడా రీజన్స్ చెప్పలేకపోయారు వాళ్లు. దీంతో శివాజీ హీరో అయిపోయాడు. తర్వాత నామినేషన్స్ లో కూడా శివాజీకి సరైన రీజన్స్ చెప్పకపోతే మాత్రం ప్రేక్షకులు ఈసారి వన్ బై వన్ ఎలిమినేట్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదీ మేటర్.