బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ట్రయాంగిల్‌ స్టోరీపై అభిజీత్ క్లారిటీ ఇచ్చేశాడుగా…!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ తొలి మైలురాయి దాటేసింది. కొత్త సీజన్‌ పది రోజులు ముగించుకుంది. ఈ తొమ్మిది రోజులు హౌస్‌మేట్స్‌ అందించిన వినోదం కంటే… ఈ రోజు కాస్త బెటర్‌ అనే అనుకోవాలి. డ్యాన్స్‌లు, స్టెప్పులతో హౌస్‌మేట్స్‌ వీక్షకులకు మజా అందించారు. పదో రోజు ఇంకా ఏమైందంటే…

* రాత్రి 12 గంటలకు లాస్య, సుజాత, మోనాల్‌ భేటీ వేశారు. మోనాల్‌తో మాట్లాడదామంటే… అస్సలు కుదరడం లేదు అనేది లాస్య, సుజాత కంప్లైంట్‌. ఎప్పుడు మాట్లాడదామన్నా… మోనాల్‌తో ఎవరో ఒకరు ఉంటున్నారు అని లాస్య అంది. అందరితో మాట్లాడటానికి టైమ్‌ దొరుకుతున్నా… నీతో మాట్లాడటానికి నువ్వు ఖాళీగా ఉండటం లేదు అని చెప్పారు. ఇదంతా మోనాల్‌ చుట్టూ అఖిల్‌ తిరుగుతుండటం వల్లనే అనేది ఇన్‌ డైరక్ట్‌గా చెప్పేశారు లాస్య, సుజాత.

* పదో రోజు ‘శ్రీమంతుడు’లోని ‘దిమ్మతిరిగే..’ పాటతో హౌస్‌మేట్స్‌కు గుడ్‌మార్నింగ్‌ చెప్పాడు బిగ్‌బాస్‌. ఉదయాన్నే లేవగానే మోనాల్‌ దగ్గరకు వెళ్లి అఖిల్‌ ఓ హగ్గు ఇవ్వడం కనిపించింది. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌ అందరూ తమ స్టైల్‌లో స్టెప్పేలేశారు. బెడ్‌ రూమ్‌లో దిండ్లుతో ఆడుకోవడం చూస్తుంటే… ఈ రోజు మజా మజాగా సాగేలా కనిపిస్తోంది.

* అభిజిత్‌, మోనాల్‌ ఓ మూలకు కూర్చుని మాట్లాడకుంటుంటే… అఖిల్‌ వచ్చి మోనాల్‌కు టిఫిన్‌ తినమని దోసె ఇచ్చాడు. ఆ ఇవ్వడంతో అభిజిత్‌ మీద కోపం కనిపించింది. కనీసం అక్కడ అభిజీత్‌ ఉన్నాడనే విషయం కూడా తెలియనట్లు అఖిల్‌ వెళ్లిపోయాడు.

* ప్రోమోలో చూపించిన ‘నీళ్ల’ ఆట.. ఇప్పుడు జరిగింది. మోనాల్‌ దోస తింటూ పొలమారితే అభిజీత్‌ ‘బ్లెస్‌ యూ’ అంటూ కన్సోల్‌ చేశాడు. ఇంకా పొలమారడం కొనసాగడంతో నీళ్ల కోసం లేచాడు. ఈ లోగా కిచెన్‌ దగ్గర తింటున్న అఖిల్‌ లేచి బాటిల్‌ తీసుకొని నీళ్లిచ్చాడు. ఈ సమయంలో అభిజీత్‌ వచ్చి ‘నువ్వు ఇస్తున్నావా’ అని అడిగినా అఖిల్‌ సమాధానం చెప్పలేదు.

* కాసేపటికి అఖిల్‌ – మోనాల్‌ కలసి కూర్చొని మాట్లాడుకున్నారు. అప్పుడు మోనాల్‌ కెమెరాలను చూడటం అఖిల్‌ చూసి… ‘నువ్వు మొదట కెమెరాలు చూడటం ఆపు’ అంటూ కసురుగా అన్నాడు. ఆ తర్వాత కాసేపు ఆ చర్చ సాగింది. ‘రియాలిటీ షోలో ఉన్నాం.. ఒక కెమెరా నుండి కాకపోయినా మరో కెమెరాలో చిక్కుతాం’ అంటూ రియాలిటీ షో వేదాంతం చెప్పుకొచ్చాడు.

* 24 గంటలు నవ్వేవాళ్లను పిచ్చోళ్లు అంటారు అంటూ అఖిల్‌ కొత్త సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం నా వల్ల కాదు.. నేను ఒక్కోసారి లో ఫీల్‌లో ఉంటాను. బాధపడతాను అంటూ తన ఫీలింగ్స్‌ చెప్పాడు. ఆ తర్వాత అసలు పాయింట్‌లోకి వచ్చాడు. ‘అభి నా గురించి నీకేమైనా చెబితే నాకు చెప్పకు’ అంటూ మొదలెట్టాడు. నేనూ అలా చెప్పను అంటూ క్లారిటీ ఇచ్చాడు. నా గురించి అభిజీత్‌కి ఏదైనా అనిపిస్తే… నాకు నేరుగా చెప్తాడులే. నువ్వు మధ్యలో వచ్చి బ్యాడ్‌ అవ్వకు అన్నాడు. ఏదైతేముంది అభిజీత్‌ మీద తన కోపం చూపించేశాడు అఖిల్‌. అయినా అంత కోపం ఎందుకొచ్చిందో?

* కుమార్‌ సాయితో ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు, ఎవరితోనూ అతను కలవడం లేదు అంటూ లాస్య తన అబ్జర్వేషన్‌ చెప్పింది. సోహైల్‌, ఆరియానా గురించి కూడా డిస్కషన్‌ వచ్చింది. సోహైల్‌తో తనకు సరిపడదు అంటూ లాస్య చెప్పింది. సుజాతదీ అదే మాట.

* ఈ రోజు ఎంటర్‌టైన్మెంట్‌ కోసం బిగ్‌బాస్‌ ‘బీబీ టాలెంట్‌ షో’ను ఏర్పాటు చేశాడు. ఆరియానా యాంకర్‌గా… నోయల్‌, లాస్యను జడ్జీలుగా డ్యాన్స్‌ షోను ఏర్పాటు చేశాడు. అయితే షో మొదలయ్యే ముందు నోయల్‌ – లాస్య ఓ పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. దానికి నోయల్‌ ర్యాప్‌ రూపొందించాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. ఈ టాలెంట్‌ షోలో గంగవ్వ పాట పాడాలి. దీని కోసం టీమ్స్‌ కూడా బిగ్‌బాసే చెప్పాడు. హారిక – మెహబూబ్‌, మోనాల్‌ – సోహైల్‌, అమ్మ రాజశేఖర్‌ (సోలో) పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. ఆఖరిగా అమ్మాయిల నుండి ఒకరిని, అబ్బాయిల నుండి ఒకరిని ఎంపిక చేసి స్టార్‌ పర్‌ఫార్మర్‌గా ఎంపిక చేస్తారు. మిగిలిన సభ్యులు మధ్యలో యాడ్స్‌ చేయాలి.

* యాడ్స్‌ విషయంలో అభిజీత్‌, దేవి మధ్య చిన్న చర్చ జరిగింది. ఈ విషయంలో అఖిల్‌, కళ్యాణి కూడా అభిజీత్‌కే సపోర్టు చేశారు. అయితే దేవీ మాత్రం అలాంటి యాడ్‌కు సిద్ధంగా లేదు. హీరోగా చేసిన నేను అలాంటి యాడ్‌ చేయడానికి నాకే ఇబ్బంది లేనప్పుడు… మీకేంటి అని అభిజీత్‌ ఒప్పించినా దేవీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత కూడా ఈ విషయంలో చర్చ జరిగింది. ఆఖరికి దేవీకి నచ్చనివి చేయడం ఎందుకు కళ్యాణి కూల్‌ చేసేశారు.

* అఖిల్‌ – అభిజీత్‌ మధ్య ఆ గ్యాప్‌కి కారణమేంటి; మోనాల్‌ – అఖిల్- అభిజీత్‌ ట్రాయంగిల్‌ స్టోరీ వెనుక కారణమేంటి అనే విషయంలో ఈ రోజు కాస్త క్లారిటీ వచ్చింది. ‘‘ఒక రోజు అఖిల్‌ వచ్చి… అభిజీత్‌తో నిన్న ‘రా’ అనొచ్చు అని అడిగాడు. 24 ఏళ్ల అఖిల్‌ది నా తమ్ముడి వయసు. ‘కాదురా ఇలా మాట్లాడు..’ అని అనడం వేరు.. ‘అరె అభిజీత్‌ ఇట్లారారేయ్‌’ అనడం వేరు. ఇదే విషయాన్ని అఖిల్‌ కు చెప్పా’’ అంటూ అభిజీత్‌ అసలు విషయం చెప్పాడు. ఆ రోజు విషయాన్ని క్లారిటీగా చెప్పినా… అర్థం చేసుకున్నట్లు లేడు. అక్కడే మా మధ్య దూరం పెరిగింది. అయినా నా చెడ్డీ బడ్డీ కాడు కదా… నేనెందుకు ఆ చనువు ఇవ్వాలి అంటూ అభిజీత్‌ ఫుల్‌ క్లారిటీతో ఉన్నాడు.

*మోనాల్‌ – అఖిల్‌ విషయంలో మరో విషయం కూడా జరిగింది. ముందు రోజు రాత్రి అఖిల్‌ , అభిజీత్‌ మాట్లాడుకొని తర్వాత లేచి బాగానే వెళ్లి నిద్రపోయారు. రెండో ఉదయాన్నే లేచి అభిజీత్‌ నిద్ర ముఖంలో ఉండగా… మోనాల్‌ టీ ఆఫర్‌ చేసింది. అయితే సుగర్‌ టీ తాగకపోవడం వల్ల అభిజీత్‌ వద్దన్నాడు. దాంతో మోనాల్‌ కోపంగా టీని విసిరి పక్కకు పడేసింది. ఆ తర్వాత వేరే కప్‌లోకి తీసుకుంది. దానిని అఖిల్‌ చూశాడు. ఈ రెండు విషయాల వల్ల అఖిల్‌ కోపంగా ఉన్నాడేమో అనిపిస్తోంది అంటూ అభిజీత్‌ లాస్య, సుజాతకు చెప్పాడు. ఇక్కడ విషయమేంటంటే ఈ రెండూ బిగ్‌ బాస్‌ ప్రేక్షకులకు చూపించలేదు. అయినా ఇలాంటివి బిగ్‌బాస్‌ ఎలా మిస్‌ అయ్యాడబ్బా. వీకెండ్‌లో చూపిస్తారేమో మరి.

* సాయంత్రం పర్‌ఫార్మెన్స్‌ కోసం సోహైల్‌, మోనాల్‌ రిహార్సిల్‌ చేస్తుండటం అఖిల్‌ పక్కనే బెడ్‌ మీద వాలి చూస్తూనే ఉన్నాడు. బయటకు బాగానే కనిపిస్తున్నా… అఖిల్‌ లోపల ఏదో చిన్న యుద్ధమే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఇదే విషయాన్ని లాస్య, సుజాత, అభిజీత్‌ తమ కోణంలో చూస్తున్నారు. అభిజీత్‌కు ఇప్పటికి బాగా అర్థమవుతోంది అఖిల్‌ గురించి అని కూడా అనుకున్నారు. మరోవైపు మోనాల్‌కు కూడా ఏదో డౌట్‌ వచ్చింది. ఇంట్లో వాళ్ల చూపులు మారాయి అని అఖిల్‌కి చెప్పింది. దీంతో అఖిల్‌ కూడా స్టార్ట్‌ చేశాడు. నేను నీకు ఎప్పటి నుండో చెబుతున్నాను. నువ్వే వినలేదు అంటూ మరోసారి మోనాల్‌ను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడానికి ప్రయత్నించాడు.

* ఆ చర్చ తర్వాత అభిజీత్‌, మోనాల్‌ మధ్య మరో చర్చ జరిగింది. ఇంట్లో కొంతమంది ఫ్లిప్పర్స్‌ ఉన్నారని మోనాల్‌ చెప్పింది. ఏ ఎండకు ఆ గొడుకు పట్టేలా కొందరు ఉన్నారని చెప్పింది. అలాంటివాళ్లను అస్సలు పట్టించుకోను అని కూడా చెప్పింది. ఇదంతా నిన్న రాత్రి లాస్య, సుజాత గురించి మాట్లాడిన టాపిక్‌ గురించే అని కూడా మోనాల్‌ స్పష్టం చేసింది. అంటే లాస్య, సుజాత మాట్లాడిన మాట్లు ఆమెకు నచ్చలేదని తేల్చింది. అఖిల్‌, అభితో నువ్వు మాట్లాడటం వల్ల నీకు అందరూ దూరమవుతున్నారని లాస్య చెప్పిందని అభితో మోనాల్‌ అంది. ఇది అస్సలు నచ్చలేదని కూడా చెప్పేసింది. ఈ విషయంలో సుజాత, లాస్యకు అర్థమైపోయింది. ఆ తర్వాత అఖిల్‌తో కూడా ‘ఫ్లిప్పర్స్‌’ విషయం మోనాల్‌ చెప్పింది. అఖిల్‌ కూడా దొరికిందే సందుగా… నిజమా… అంటూ ఆశ్చర్యపోయాడు. ఈ మొత్తం డిస్కషన్‌ వల్ల అభిజీత్‌, అఖిల్‌ గురించి లాస్య, సుజాత చెప్పిన విషయం మోనాల్‌కు నచ్చలేదని తెలిసిపోయింది.

* బీబీ టాలెంట్‌ షోలో తొలి పార్టిసిపెంట్‌గా అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ వచ్చారు. తనదైన శైలిలో మాస్‌ స్టెప్పులతో అదరగొట్టాడు. మధ్యలో దివి, కళ్యాణి స్పెషల్‌ అపీరియన్స్‌ కూడా ఇచ్చారు. మొత్తంగా మాస్టర్‌ తన కొరియోగ్రాఫర్‌ పనితనం ఇక్కడ చూపించారు. పర్‌ఫార్మెన్స్‌ తర్వాత అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ యాక్టింగ్‌తో కూడా చింపేశాడు. జడ్జీలకు పాయింట్లు ఉండటంతో లాస్య, నోయల్‌ కూడా తన టాలెంట్‌ను చూపించారు.

* ‘వానా వానా వెల్లువాయే..’ పాటకు సోహైల్‌, మోనాల్‌ హాట్‌ మూమెంట్స్‌తో పిచ్చెక్కించారు. మోనాల్‌ డ్యాన్స్‌ను అభిజీత్‌ నవ్వుతూ ఎంజాయ్‌ చేయగా,… అఖిల్‌ మాత్రం ఏదో ఆందోళనతో చూసినట్లుగా కనిపించాడు. ఎందుకో ఆ ఆందోళన ఎప్పుడు చెబుతాడో మరి.

* ‘బమ్‌చిక్‌ ప్యాన్‌’ యాడ్‌ అంటూ… లాస్య, అఖిల్‌, అభిజీత్‌, కళ్యాణి ఓ యాడ్‌ చేశారు. ఎందుకు చేశారో, ఏం చేశారో అర్థం కానంత క్లారిటీగా చేశారు.

* రెండు పాటలు చూసిన తర్వాత ఎలాగైనా బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ కొట్టాయాలని హారిక – మెహబూబ్‌ తమ టాలెంట్‌ మొత్తం చూపించారు. సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘టాపు లేచిపోద్దే…’కి సూపర్‌ స్టెప్పులు వేశారు. హారిక చూపించిన ఈజ్‌, హాట్‌నెస్‌ అన్‌మ్యాచబుల్‌ అసలు. మెహబూబ్‌ జిమ్నాస్టిక్‌ మూమెంట్స్‌కు హారిక క్యూట్‌నెస్‌ భలే జోడీ అయ్యింది. ఫుల్‌ సాంగ్‌కి మూమెంట్స్‌ వేయడం.. అందులోనూ సింగిల్‌ షాట్‌లో అంటే మాటలు కాదు. అందుకే మెహబూబ్‌ బెస్ట్‌ పర్‌ఫార్మర్‌గా నిలిచాడు. హారికకు బెస్ట్‌ పర్‌ఫార్మర్‌గా నిలిచింది. అంత బాగా డ్యాన్స్‌ చేస్తే రాకుండా ఉంటుంది మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus