Bigg Boss Telugu 6: రెమ్యునరేషన్ విషయంలో అతను టాప్ – ఆమె లీస్ట్ అట..!

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 6 గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. హోస్ట్ నాగార్జున ఆల్రెడీ వీళ్ళను హౌస్ లోకి పంపడం జరిగింది. అయితే ఈసారి ఎంపికైన కంటెస్టెంట్స్ లో తెలిసిన మొహాలు చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. సింగర్ రేవంత్, అభినయ శ్రీ, చలాకీ చంటి, సుదీప(నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ) వంటి వారు తప్ప మిగిలిన మొహాలు బుల్లితెర పై టీవీ షోలు, సీరియల్స్ బాగా చూసే వారికి మాత్రమే తెలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళ పారితోషికాలు ఎంత వరకు ఉండొచ్చు. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అనే డిస్కషన్లు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సీజన్ కంటెస్టెంట్లకి ఒక్కో రోజుకు రూ.15 వేల నుండి రూ.60 వేల వరకు పారితోషికం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఒకసారి కంటెస్టెంట్ల పారితోషికాల లిస్ట్ ను గమనిస్తే :

1. కీర్తి భట్ :

‘కార్తీక దీపం’ సీరియల్ నటి అయిన ఈమెకు ఒక్కో రోజుకు రూ.35 వేలు పారితోషికం అందుకుంటుందట.

2. సుదీప :

‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ అలియాస్ సుదీపకి ఒక్కో రోజుకు గాను రూ.20 వేలు పారితోషికం ఆఫర్ చేశారట.

3. శ్రీహన్ :

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ సిరి బాయ్ ఫ్రెండ్ మరియు యూట్యూబర్ అయిన శ్రీహాన్ కు ఒక్కో రోజుకు రూ.50 వేలు పారితోషికం ఇస్తున్నారట.

4. నేహా నేహా చౌదరి :

యాంకర్ నేహా చౌదరి కి ‘బిగ్ బాస్’ యాజమాన్యం ఒక్కో రోజుకు రూ.30 వేలు పారితోషికం ఆఫర్ చేశారట.

5. శ్రీ సత్య :

ప్రముఖ మోడల్ నటి అయిన ఈమెకు ఒక్కో రోజుకు రూ.30 వేలు పారితోషికం తీసుకుంటుందట.

6. అర్జున్ కళ్యాణ్ :

సీరియల్ నటుడు అర్జున్ కు ఒక్కో రోజుకు గాను రూ.35 వేలు పారితోషికం ఇస్తున్నారట.

7. చలాకీ చంటి :

‘జబర్దస్త’ కమెడియన్ చంటికి ఒక్కో రోజుకు గాను ఏకంగా రూ.50 వేలు వరకు పారితోషికం ఇస్తున్నారట.

8. అభినయ శ్రీ :

సీనియర్ నటి, ఐటెమ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ బ్యూటీ ఒక్కో రోజుకు రూ.20 వేల పారితోషికం అందుకుంటుందట.

9. గీతూ రాయల్ :

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అడుగుపెట్టిన ఈమె ఒక్కో రోజుకు రూ.25 వేల వరకు పారితోషికం అందుకుంటుందని తెలుస్తుంది.

10. బాలాదిత్య :

చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో కమ్ సీరియల్ నటుడు అయిన బాలాదిత్య బిగ్ బాస్ లో ఒక్క రోజుకు గాను రూ.35 వేల వరకు పారితోషికం అందుకుంటున్నాడు అని తెలుస్తుంది.

11. మరీనా :

సీరియల్ నటి, కంటెస్టెంట్ రోహన్ భార్య అయిన ఈమె ఒక్కో రోజుకు రూ.40 వేల పారితోషికం అందుకుంటుందని తెలుస్తుంది.

12. రోహిత్ :

సీరియల్ నటుడు మరియు మరీనా భర్త అయిన రోహిత్ కూడా ఒక్కో రోజుకు రూ.40 వేల పారితోషికం అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

13. వాసంతి కృష్ణన్ :

సీరియల్ నటి ఒక్కో రోజుకు రూ.25 వేల పారితోషికం అనుకుంటుందట.

14. షాని :

సై నటుడు షాని కూడా ఒక్కో రోజుకు రూ.30 వేల పారితోషికం అందుకుంటున్నాడట.

15. ఆర్జే సూర్య (ఆర్జే) :

ఇతనికి రోజుకు రూ.40 వేల వరకు పారితోషికం ఇస్తున్నారట.

16. ఆది రెడ్డి :

బిగ్ బాస్ రివ్యూలు చెప్పే యూట్యూబర్ ఆదిరెడ్డి బిగ్ బాస్ 6 లో పాల్గొనేందుకు రోజుకు రూ.30 వేలు అందుకుంటున్నాడట.

17. ఆరోహి రావు :

టీవీ యాంకర్ ఆరోహికి ఒక్కో రోజుకు కేవలం రూ.15 వేల పారితోషికం మాత్రమేనట.

18. ఫైమా :

‘పటాస్’ ఫేమ్, ‘జబర్దస్త్’ కమెడియన్ అయిన ఫైమాకి ఒక్కో రోజుకి రూ.25 వేల పారితోషికం ఇస్తున్నారట.

19. రాజశేఖర్ :

ప్రముఖ మోడల్ మరియు నటుడు అయిన రాజశేఖర్ కు ఒక్కో రోజుకు రూ.20 వేల పారితోషికం ఇస్తున్నారట.

20. ఇనయా సుల్తానా :

ప్రముఖ నటి ఇనయ సుల్తానా కి ఒక్కో రోజుకు గాను కేవలం రూ.15 వేలు పారితోషికం మాత్రమే ఆఫర్ చేశారట.

21. రేవంత్ :

ఈ సీజన్లో అందరి కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటున్నది సింగర్ రేవంత్ అని స్పష్టమవుతుంది. ఇతను ఒక్కో రోజుకు గాను రూ.60 వేల పారితోషికం అందుకుంటున్నాడట.

మొత్తంగా అతి తక్కువ పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్లు ఇనయా సుల్తానా, టీవీ9 యాంకర్ ఆరోహి అని స్పష్టమవుతుంది. ఇక అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్ మాత్రం సింగర్ రేవంత్ అని స్పష్టమవుతుంది.

బిగ్ బాస్ 6 కంటెస్టంట్స్ లిస్టు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus